India vs Pakistan : భారత్-పాక్ మ్యాచ్‌కే హైప్ ఎక్కువ..!
ఛాంపియన్స్ ట్రోఫీలో మిగతా అన్ని మ్యాచుల్లాగానే భారత్-పాక్ మ్యాచ్ పోరు ఉంటుందని హర్భజన్ సింగ్ స్పష్టం చేశారు.

ఛాంపియన్స్ ట్రోఫీలో మిగతా అన్ని మ్యాచుల్లాగానే భారత్-పాక్ మ్యాచ్ పోరు ఉంటుందని హర్భజన్ సింగ్ స్పష్టం చేశారు. అయితే ఈ మ్యాచ్‌పై ఓవర్‌హైప్ నెలకొందని అన్నారు. ‘భారత్ పటిష్ఠమైన జట్టు. పాకిస్థాన్ నిలకడలేమితో ఉంది. ఐసీసీ టోర్నీల్లో రెండు టీమ్‌ల నంబర్లను పోల్చి చూస్తే మీకే అర్థమవుతుంది’ అని పేర్కొన్నారు. కాగా ఇటీవల సొంత గడ్డపై జరిగిన ట్రైసిరీస్(PAK-NZ-SA)లో పాక్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మరో ఆటగాడు, భారత స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా గాయం కారణంగా చాంపియన్స్ ట్రోఫీకి దూరమైన విషయం తెలిసిందే. బుమ్రా లేకపోవడం కచ్చితంగా భారత్‌కు లోటే. దీనిపై భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ గెలవాలంటే బుమ్రా లేకుండా ఆడటం నేర్చుకోవాలని వ్యాఖ్యానించాడు. ‘చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియానే ఫేవరెట్ అని ఇప్పటికీ నమ్ముతున్నా. మ్యాచ్‌లను గెలిపించే శక్తి బుమ్రాకు ఉందన్నాడు. అతను లేకపోయినా అర్ష్‌దీప్, షమీ, కుల్దీప్, జడేజా వంటి అనుభవజ్ఞులు ఉన్నారని హర్భజన్ అన్నారు.
