ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో, చివరి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పటిష్ట స్థితిలో ఉన్న భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో మ్యాచ్‌ను గెలవాలని ప్రయత్నిస్తోంది.

ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో, చివరి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో పటిష్ట స్థితిలో ఉన్న భారత జట్టు ఇన్నింగ్స్ తేడాతో మ్యాచ్‌ను గెలవాలని ప్రయత్నిస్తోంది. 473/8 స్కోరుతో భారత జట్టు శనివారం ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. నిన్న‌టి స్కోరుకు నాలుగు ప‌రుగులు జోడించ‌గానే చివ‌రి రెండు వికెట్లు ప‌డ్డాయి. దీంతో ఇంగ్లండ్‌పై భారత్ తొలి ఇన్నింగ్స్ లో 259 పరుగుల ఆధిక్యం ల‌భించింది. రెండో ఇన్నింగ్సు ప్రారంభించిన ఇంగ్లాండ్‌కు ఆదిలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. ఓపెన‌ర్లు క్రాలీ(1), డ‌కెట్‌(2), ఓలి పోప్‌(19) లను స్టార్ స్పిన్న‌ర్ అశ్విన్ పెవిలియ‌న్‌కు పంపాడు. ఇంగ్లాండ్ ప్ర‌స్తుత స్కోరు 36-3.. కాగా.. 222 ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ విజ‌యం సాధించాలంటే.. రెండో ఇన్నింగ్‌లో భారీ స్కోరు సాధించాల్సి ఉంటుంది. ప్ర‌స్తుత ప‌రిస్థితి చూస్తుంటే అలా క‌నిపించ‌డం లేదు.

భారత జట్టు ఇప్పటికే 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో 4-1తో విజయం సాధించాలని రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ప్రయత్నిస్తోంది. హైదరాబాద్ టెస్ట్‌లో వెనుకబడిన తర్వాత భారత్ బలమైన పునరాగమనం చేసింది. తదుపరి మూడు టెస్టులను వరుసగా గెలుపొందడం ద్వారా సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యం సాధించింది.

Updated On 8 March 2024 11:51 PM GMT
Yagnik

Yagnik

Next Story