విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 78.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 398 పరుగుల ఆధిక్యం దక్కింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ( 61 బంతుల్లో 29, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఒంటరిపోరాటం చేసి భారత ఆధిక్యాన్ని 400 పరుగులకు చేరువగా తీసుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని కలుపుకుని భారత్.. ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఓవర్నైట్ స్కోర్ 28-0తో […]
విశాఖపట్నం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 78.3 ఓవర్లలో 255 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్‌కు 398 పరుగుల ఆధిక్యం దక్కింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ( 61 బంతుల్లో 29, 2 ఫోర్లు, 1 సిక్సర్) ఒంటరిపోరాటం చేసి భారత ఆధిక్యాన్ని 400 పరుగులకు చేరువగా తీసుకొచ్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యాన్ని కలుపుకుని భారత్.. ఇంగ్లండ్ ముందు 399 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఓవర్నైట్ స్కోర్ 28-0తో శనివారం ఆట ప్రారంభించిన భారత జట్టు... వెంటవెంటనే రెండు వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ 13 పరుగులు జోడించి ఔటయ్యాడు. ఆ వెంటనే యశస్వి జైశ్వాల్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్, రజత్ పటీదార్ కూడా విఫలమయ్యారు. దీంతో 122 పరుగులకే భారత జట్టు నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో శుభ్ మన్ గిల్, అక్షర్ పటేల్ తో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. 131 బంతులను ఎదుర్కొని టెస్టుల్లో మూడో సెంచరీ సాధించాడు. 104 పరుగులు చేశాక గిల్ పెవిలియన్ బాట పట్టాడు. గిల్ సెంచరీపై భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్పందించాడు. "సరైన సమయంలో సెంచరీ కొట్టినందుకు శుభాభినందనలు. ఈ ఇన్నింగ్స్ లో శుభ్ మాన్ గిల్ బ్యాటింగ్ పూర్తి నైపుణ్యంతో కొనసాగింది" అంటూ కొనియాడాడు.