భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం అయ్యింది. తొలి టెస్టు నేటి నుంచి హైదరాబాద్‌లో జరుగుతుంది.

భారత్, ఇంగ్లండ్(IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ గురువారం నుంచి ప్రారంభం అయ్యింది. తొలి టెస్టు నేటి నుంచి హైదరాబాద్‌(Hyderabad)లో జరుగుతుంది. తొలి రెండు టెస్టులకు వ్యక్తిగత కారణాలతో విరాట్ కోహ్లీ(Virat Kohli) దూరమయ్యాడు. అలాగే వికెట్ కీపింగ్ బాధ్యతల నుంచి కేఎల్ రాహుల్‌(KL Rahul)ను కోచ్ ద్రవిడ్(Coach Dravid) తప్పించాడు. దీంతో స్పెషలిస్ట్ వికెట్ కీపర్‌గా ప్లేయింగ్-11లో కేఎస్ భరత్‌(KS Bharat)కు అవకాశం లభించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

తొలి రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 119 పరుగులు చేసింది. ప్రస్తుతం యశస్వి జైస్వాల్(Yashaswi Jaishwal) 70 బంతుల్లో 76 పరుగులతో, శుభ్‌మన్ గిల్(Shubhman Gill) 43 బంతుల్లో 14 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి మధ్య రెండో వికెట్‌కు 39 పరుగుల భాగస్వామ్యం ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 23 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసి ఒక వికెట్ కోల్పోయింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 246 పరుగుల వద్ద ముగిసింది. ఈ స్కోరుకు భారత్ ఇంకా 127 పరుగులు వెనుకబడి ఉంది. బెన్ స్టోక్స్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడి 70 పరుగులు చేశాడు. భారత్ తరఫున అశ్విన్(Ashwin), జడేజా(Jadeja) చెరో మూడు వికెట్లు తీశారు.

Updated On 25 Jan 2024 8:24 AM GMT
Yagnik

Yagnik

Next Story