భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న హైదరాబాద్ టెస్టులో నేడు మూడో రోజు ఆట కొన‌సాగుతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసింది.

భారత్(India), ఇంగ్లండ్(England) జట్ల మధ్య జరుగుతున్న హైదరాబాద్(Hyderabad) టెస్టులో నేడు మూడో రోజు ఆట కొన‌సాగుతుంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసింది. అనంత‌రం భారత్ తన మొదటి ఇన్నింగ్స్‌లో 436 ప‌రుగుల‌కు ఆలౌట్ అయ్యింది. ఆపై ఇంగ్లిష్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా బ్యాటింగ్ చేస్తోంది. మూడో రోజు లంచ్ సమయానికి తన రెండో ఇన్నింగ్స్‌లో 15 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 89 పరుగులు చేసింది. బెన్ డకెట్(Ben Dukket) 42 బంతుల్లో 38 పరుగులతో, ఒలీ పోప్(Pope) 15 బంతుల్లో 16 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. జాక్ క్రౌలీ(Jack Crowley) రూపంలోనే జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. అతడిని అశ్విన్ అవుట్ చేశాడు. క్రౌలీ 33 బంతుల్లో 31 పరుగులు చేశాడు. 45 పరుగుల స్కోరు వ‌ద్ద అశ్విన్ బౌలింగ్‌ జాక్ క్రౌలీ రోహిత్ కి క్యాచ్ ఇచ్చాడు.

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 246 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ 436 పరుగుల వద్ద ముగిసింది. దీంతో టీమిండియా 190 పరుగుల ఆధిక్యం సాధించింది. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో భారత్ కంటే 101 పరుగులు వెనుకబడి ఉంది.

భారత్ తొలి ఇన్నింగ్స్ 436 పరుగుల వద్ద ముగిసింది. భారత్ తరఫున రవీంద్ర జడేజా(Ravindra Jadeja) సెంచరీ మిస్సయ్యాడు. 87 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. కేఎల్ రాహుల్(KL Rahul) 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్‌లో మొత్తం 10 వికెట్లు స్పిన్నర్లు తీశారు. జో రూట్(Joe Root) నాలుగు వికెట్లు తీశాడు. టెస్టుల్లో జో రూట్‌కి ఇది రెండో అత్యుత్తమ బౌలింగ్‌. అంతకుముందు 2021లో అహ్మదాబాద్‌లో భారత్‌పై ఎనిమిది పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టాడు.

Updated On 27 Jan 2024 1:09 AM GMT
Yagnik

Yagnik

Next Story