టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా, కెనడా మ్యాచ్ కనీసం టాస్ కూడా వేయకుండానే రద్దయింది. మ్యాచ్ కు వేదికైన ఫ్లోరిడాలో వర్షం కురవడంతో మైదానం చిత్తడిగా మారింది. ఆటగాళ్లు ఫీల్డింగ్ చేయడం చాలా కష్టమని మ్యాచ్ నిర్వాహకులు నిర్ణయించుకోవడంతో మ్యాచ్ ను రద్దు చేయడమే బెటర్ అని ప్రకరించారు. మ్యాచ్ సమయానికి వర్షం లేనప్పటికీ, మైదానాన్ని ఆటకు అనువుగా సిద్ధం చేసేందుకు గ్రౌండ్ స్టాఫ్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో టీమిండియా, కెనడా జట్లకు చెరో పాయింట్ లభించింది. గ్రూప్-ఏ నుంచి టీమిండియా, ఆతిథ్య అమెరికా జట్లు ఇప్పటికే సూపర్-8 దశకు చేరుకున్నాయి. వరల్డ్ కప్ లో జూన్ 19 నుంచి సూపర్-8 మ్యాచ్ లు నిర్వహించనున్నారు. సూపర్-8 దశలో టీమిండియా తన తొలి మ్యాచ్ ను ఆఫ్ఘనిస్థాన్ తో జూన్ 20న బార్బడోస్ లో తలపడనుంది. జూన్ 22న మరో మ్యాచ్, జూన్ 24న ఆస్ట్రేలియాతో భారతజట్టు తలపడనుంది.


Eha Tv

Eha Tv

Next Story