ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2021-23 పైన‌ల్‌ మ్యాచ్ ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో భారత్, ఆస్ట్రేలియా జ‌ట్ల మధ్య జరుగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. బ‌దులుగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు మాత్ర‌మే చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 173 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంత‌రం

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్(World Test Championship) 2021-23 పైన‌ల్‌ మ్యాచ్ ఇంగ్లండ్‌(England)లోని ఓవల్‌(Oval)లో భారత్(India), ఆస్ట్రేలియా(Australia) జ‌ట్ల మధ్య జరుగుతోంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. బ‌దులుగా భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు మాత్ర‌మే చేసింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 173 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంత‌రం రెండో ఇన్నింగ్స్ ప్రారంబించిన‌ ఆస్ట్రేలియా నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కెమరూన్ గ్రీన్(Cameroon Green) ఏడు పరుగులతో, మార్నస్ లబుషెన్(Marnus Labuschagne) 41 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. దీంతో ఆస్ట్రేలియా జ‌ట్టు ఇప్ప‌టికే 296 ప‌రుగుల ఆధిక్యంలో ఉంది.

నాలుగో రోజు ఆస్ట్రేలియాను వీలైనంత త్వరగా ఆలౌట్ చేసేంయాల‌ని భారత జట్టు భావిస్తోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఉస్మాన్ ఖవాజా(Usman Khawaja) 13 పరుగుల వద్ద, డేవిడ్ వార్నర్(David Warner) ఒక పరుగుతో, స్టీవ్ స్మిత్(Steave Smith) 34 పరుగుల వద్ద, ట్రావిస్ హెడ్(Travis Head) 18 పరుగుల వద్ద ఔటయ్యారు. భారత్ తరఫున రవీంద్ర జడేజా(Ravindra Jadeja) రెండు వికెట్లు తీశాడు. అదే సమయంలో మహ్మద్‌ సిరాజ్‌(Mohammad Siraj), ఉమేష్‌ యాదవ్‌(Umesh Yadav)లకు చెరో వికెట్ దక్కింది. గత ఇన్నింగ్స్‌లో సెంచరీలు చేసిన స్మిత్, హెడ్ ఇద్దరినీ జడేజా పెవిలియన్‌కు పంపాడు.

Updated On 9 Jun 2023 8:45 PM GMT
Yagnik

Yagnik

Next Story