భారతదేశం- ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ ఫిబ్రవరి 11, ఆదివారం మధ్యాహ్నం 1:3 నుండి జరుగుతుంది.

అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ కు భారత్ మరోసారి చేరుకుంది. టైటిల్ కోసం ఆస్ట్రేలియాతో భారతజట్టు తలపడనుంది దక్షిణాఫ్రికాలోని బెనోనీ వేదికగా ఫిబ్రవరి 11న భారత్, ఆస్ట్రేలియా అండర్-19 జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ జరగనుంది. భారత్ ఇప్పటి వరకు 2000, 2008, 2012, 2018, 2022ల్లో అండర్-19 ప్రపంచకప్ టైటిల్ గెలిచింది. ఇప్పుడు మరోసారి ఫైనల్ చేరి ఆరో టైటిల్ కోసం ఆస్ట్రేలియాతో తలపడనుంది. భారతదేశం- ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ ఫిబ్రవరి 11, ఆదివారం మధ్యాహ్నం 1:3 నుండి జరుగుతుంది. ఫైనల్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హాట్‌స్టార్‌లో కూడా చూడొచ్చు.

భారతజట్టు: ఉదయ్ సహారన్ (సి), అర్షిన్ కులకర్ణి, ఆదర్శ్ సింగ్, రుద్ర మయూర్ పటేల్, సచిన్ దాస్, ప్రియాంషు మోలియా, ముషీర్ ఖాన్, ఆరవెల్లి అవనీష్ రావు (WK), సౌమీ కుమార్ పాండే (VC), మురుగన్ అభిషేక్, ఇన్నేష్ మహాజన్ (WK ), ధనుష్ గౌడ, ఆరాధ్య శుక్లా, రాజ్ లింబాని, నమన్ తివారీ.

ఆస్ట్రేలియా: హ్యూ వీబ్‌జెన్ (సి), లాచ్‌లాన్ ఐట్‌కెన్, చార్లీ ఆండర్సన్, హర్కీరత్ బజ్వా, మహాలి బార్డ్‌మ్యాన్, టామ్ కాంప్‌బెల్, హ్యారీ డిక్సన్, ర్యాన్ హిక్స్ (WK), సామ్ కాన్స్టాస్, రాఫెల్ మాక్‌మిలన్, ఐడాన్ ఓ'కానర్, హర్జాస్ సింగ్, టామ్ స్ట్రాకర్, కల్లమ్ విడ్లెర్, ఒల్లీ పీక్.

Updated On 11 Feb 2024 4:01 AM GMT
Yagnik

Yagnik

Next Story