భారత్-ఆస్ట్రేలియా మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాయ్‌పూర్ వేదికగా నాలుగో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియాలో చాలా పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి.

భారత్-ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం రాయ్‌పూర్(Raipur) వేదికగా నాలుగో మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమ్‌ఇండియా(Teamindia)లో చాలా పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. మ్యాచ్‌కు ముందు వైస్ కెప్టెన్‌(Vice-Captain)ను మార్చ‌డమే పెద్ద విషయం. సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న భారత జట్టు రాయ్‌పూర్‌లో సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో ప్లేయింగ్ 11 జట్టులో మూడు మార్పులు చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది.

తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) నాలుగో టీ20కి తిరిగి జట్టులోకి వచ్చాడు. దీంతో అత‌డు వైస్ కెప్టెన్‌గా కొన‌సాగుతాడు. తొలి మూడు టీ20ల్లో వైస్ కెప్టెన్‌ పాత్రను పోషించిన రుతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad) ఇకపై ఏ బాధ్య‌త ఉంద‌దు. అయ్యర్ రాకతో యశస్వి జైస్వా(Yashaswi Jaishwal) లేదా తిలక్ వర్మ(Tilak Varma) ఇద్ద‌రిలో ఒక‌రు స్టాండ్స్‌కు ప‌రిమిత‌మ‌వ్వాల్సి ఉంటుంది. భారత జట్టు మూడో మ్యాచ్‌లో ఓడిపోయింది. దీంతో ఇక్కడ ఎలాగైనా గెలిచి సిరీస్‌లో తిరుగులేని ఆధిక్యం సాధించాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ మ్యాచ్‌లో భారత జట్టులో మూడు కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముందుగా శ్రేయాస్ అయ్యర్ రాకతో మిడిలార్డర్ బ్యాట్స్ మెన్ ల‌లో ఒక‌రి స్థానం గ‌ల్లంత‌య్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా ప్రమాదపు కత్తి తిలక్ వర్మపై వేలాడుతోంది. ముఖేష్ కుమార్(Mukesh Kumar) తిరిగి జ‌ట్టులోకి వచ్చినట్లయితే అవేష్ ఖాన్(Avesh Khan) జట్టు నుండి నిష్క్రమించవలసి ఉంటుంది. ఒకవేళ దీపక్ చాహర్ జట్టులో చేరితే.. ప్రసిద్ధ్ కృష్ణ(Prasiddh Krishna) స్థానాన్ని భర్తీ చేసే అవ‌కాశం ఉంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు గెలిచిన టీమిండియా మూడో మ్యాచ్‌లో ఓడిపోయింది. నాలుగో మ్యాచ్ నేడు జ‌రుగ‌నుంది.

టీమ్‌ఇండియా ప్లేయింగ్‌-11

యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), రింకు సింగ్, అక్షర్ పటేల్, దీపక్ చాహర్, రవి బిష్ణోయ్, ముఖేష్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్.

Updated On 30 Nov 2023 11:50 PM GMT
Yagnik

Yagnik

Next Story