భారత్‌ వేదికగా జరుగనున్న వన్డే క్రికెట్‌ ప్రపంచకప్ షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించింది. షెడ్యూల్‌ ప్రకారం టీమిండియా అక్టోబర్‌ 8న చెన్నై వేదికగా తొమొద‌టి మ్యాచ్ ఆడ‌నుంది. తొలి మ్యాచ్‌లో భార‌త్‌.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌తో రన్నరప్‌ న్యూజిలాండ్‌ తలపడనుంది.

భారత్‌(India) వేదికగా జరుగనున్న వన్డే క్రికెట్‌ ప్రపంచకప్(ODI World Cup) షెడ్యూల్‌ను బీసీసీఐ(BCCI) వెల్లడించింది. షెడ్యూల్‌ ప్రకారం టీమిండియా(TeamIndia) అక్టోబర్‌ 8న చెన్నై(Chennai) వేదికగా మొద‌టి మ్యాచ్ ఆడ‌నుంది. తొలి మ్యాచ్‌లో భార‌త్‌.. ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక.. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఇంగ్లండ్‌(England)తో రన్నరప్‌ న్యూజిలాండ్‌(New Zealand) తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబ‌ర్ 5న‌ అహ్మదాబాద్‌లో జ‌రుగ‌నుంది. వ‌ర‌ల్డ్ క‌ప్‌(World Cup)లోనే ఉత్కంఠ‌పోరు.. భారత్‌, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య‌ ఫైట్‌ అక్టోబర్‌ 15న అహ్మదాబాద్‌లో జరుగనుంది. వ‌ర‌ల్డ్ క‌ప్‌ ఫైనల్‌ నవంబర్‌ 19న అహ్మదాబాద్‌(Ahmedabad)లో జరుగనుంది. భారత్ 2011లో వ‌ర‌ల్డ్ క‌ప్ సాధించింది. అంత‌కుముందు 1983లో మొద‌టిసారి ప్ర‌పంచ‌క‌ప్ సాధించింది. టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొనాల్సివుండ‌గా.. ఇప్ప‌టికే 8 జట్లు అర్హత సాధించాయి.. క్వాలిఫయింగ్‌ టోర్నీ(Qualifying) ద్వారా మరో రెండు జట్లు అర్హ‌త సాధిస్తాయి.

Updated On 12 Jun 2023 9:54 PM GMT
Yagnik

Yagnik

Next Story