Asia Cup 2025 : ఆసియా కప్ భారత్‌లోనే.. మ్యాచ్‌లు ఏ ఫార్మాట్‌లో జరుగుతాయంటే..
2025 పురుషుల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది.
2025 పురుషుల ఆసియా కప్ క్రికెట్ టోర్నమెంట్‌కు భారత్ ఆతిధ్యం ఇవ్వనుంది. టీ20 ఫార్మాట్‌లో ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఈ విషయాన్ని ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. ఆసియా కప్ 2023 సీజన్‌ను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు 'హైబ్రిడ్ మోడల్'లో నిర్వహించింది. భారత్ పాకిస్తాన్‌లో పర్యటించడానికి నిరాకరించింది. దీంతో భారత్ మ్యాచ్‌లు శ్రీలంకలో జరిగాయి. 2027లో బంగ్లాదేశ్ వన్డే ఫార్మాట్‌లో ఆసియా కప్ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనుంది.
ఆసియా కప్‌లో 13 మ్యాచ్‌లు జరుగుతాయని.. 2025 భారత్‌లో టీ20 ఫార్మాట్‌లో, 2027లో బంగ్లాదేశ్‌లో 50 ఓవర్ల ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగనున్నట్లు ఆసియా క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. టెస్టు హోదా కలిగిన ఆసియా జట్లు ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ లు ఈ టోర్నీలో పాల్గొంటాయి. క్వాలిఫైయింగ్ పోటీలలో పాల్గొని నాన్-టెస్ట్ దేశాలు అర్హత సాధించాల్సివుంటుంది.