IND vs NEP : నేపాల్‌పై విజయం.. సూపర్-4 కు చేరుకున్న భారత్..
ఆసియాకప్‌లో భారత్ రెండో మ్యాచ్‌లో నేపాల్‌తో తలపడింది. భారత్, నేపాల్ మధ్య ఇదే తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అవడం విశేషం. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించిన భారత జట్టు సూపర్ ఫోర్‌కు చేరుకుంది. భారత్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది.
ఆసియాకప్(Asia Cup)లో భారత్(India) రెండో మ్యాచ్‌లో నేపాల్(Nepal)తో తలపడింది. భారత్, నేపాల్ మధ్య ఇదే తొలి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ అవడం విశేషం. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ను ఓడించిన భారత జట్టు సూపర్ ఫోర్(Super Four)కు చేరుకుంది. భారత్ టాస్(Toss) గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 230 పరుగులు చేసింది. అయితే వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్‌కు 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా టీమ్ ఇండియా లక్ష్యాన్ని ఛేదించింది.
శ్రీలంక(Srilanka)లోని పల్లెకెలె స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నేపాల్ 48.2 ఓవర్లలో 230 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కారణంగా చాలాసేపు ఆట నిలిచిపోయింది.
డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో టీమ్ ఇండియాకు 23 ఓవర్లలో 145 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. 20.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా టీమ్ ఇండియా లక్ష్యాన్ని ఛేదించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 74 పరుగులు, శుభ్‌మన్ గిల్(Shubhman Gill) 67 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. ఈ విజయంతో టీమిండియా సూపర్ ఫోర్‌కి చేరుకుంది.
గ్రూప్-ఎ నుంచి పాకిస్థాన్(Pakistan) మొదటి స్థానంలో నిలవగా.. భారత్ రెండో స్థానంలో నిలిచి సూపర్ ఫోర్‌కు అర్హత సాధించింది. సెప్టెంబర్ 6న సూపర్ ఫోర్ రౌండ్ ప్రారంభమవుతుంది. సెప్టెంబరు 10న భారత్, పాకిస్థాన్‌లు మరోసారి తలపడనున్నాయి. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.