World Cup Final : ఆలౌటైన టీమిండియా.. ఆస్ట్రేలియా విజయలక్ష్యం 241
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది.

India bowled out for the first time in World Cup 2023, post 240 in final
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర స్టేడియంలో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 1983, 2011 ఫైనల్స్‌లో కూడా టాస్ ఓడిన తర్వాతే టీమ్ ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 50 ఓవర్లు ఆడిన టీమిండియా అన్ని వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా విజయానికి 241 పరుగులు కావాలి. భారత జట్టులో కెప్టెన్ రోహిత్(47), కోహ్లీ(54), కేఎల్ రాహుల్(66) పరుగులతో రాణించారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మ్యాక్స్‌వెల్ ఒకటి, స్టార్క్ మూడు, హేజిల్‌వుడ్ రెండు, పాట్ కమ్మిన్స్ రెండు, జంపా ఒకటి ,ఒప్పున వికెట్లు తీశారు.
