వైజాగ్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ భారీ స్కోరు చేస్తుందనుకునే 400 పరుగులు కూడా చేయలేకపోయింది. 396 పరుగులకు ఆలౌట్ అయింది.

వైజాగ్(Vizag) టెస్ట్ మ్యాచ్ లో భారత్(India) భారీ స్కోరు చేస్తుందనుకునే 400 పరుగులు కూడా చేయలేకపోయింది. 396 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక్క యశస్వి జైస్వాల్(Yashaswi Jaishwal) తప్ప మిగిలిన ఎవరూ కూడా మంచి స్కోర్లు సాధించలేకపోయారు. చాలా మంది భారత బ్యాటర్లకు ఆరంభం లభించినా.. వాటిని భారీ స్కోర్లుగా మరల్చలేకపోయారు. జైస్వాల్ డబుల్ సెంచరీతో మెరిసినా.. మిగిలిన ఆటగాళ్లలో టాప్ స్కోరు 34 మాత్రమే! అది కూడా శుభమాన్ గిల్(Shubhman Gill) చేశాడు.

రెండో టెస్టులో రెండో రోజు టీమిండియా యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. 277 బంతుల్లో 18 ఫోర్లు, 7 సిక్స్‌లతో తన డబుల్‌ సెంచరీ(Double Century) మార్క్‌ను అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌ 101 ఓవర్‌ వేసిన స్పిన్నర్‌ బషీర్‌(Basheer) బౌలింగ్‌లో వరుసగా సిక్స్‌, ఫోర్‌ బాది జైశ్వాల్‌ తన డబుల్‌ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 290 బంతుల్లో 209 పరుగులు చేసి జైశ్వాల్‌ ఔటయ్యాడు. అండర్సన్‌(Anderson) బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి తన వికెట్‌ను జైశ్వాల్‌ కోల్పోయాడు. ఆ తర్వాత టెయిలెండర్లు ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేకపోయారు. జేమ్స్ ఆండర్సన్, షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్(Rehan Ahmed) తలా మూడేసి వికెట్లు తీసుకున్నారు.

Updated On 3 Feb 2024 12:06 AM GMT
Yagnik

Yagnik

Next Story