ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య విశాఖపట్నం వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది.

ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా(India vs Australia) మధ్య విశాఖపట్నం(Visakhapatnam) వేదికగా తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 8 వికెట్లు కోల్పోయి చివ‌రి బంతికి లక్ష్యాన్ని ఛేదించింది. సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) కెప్టెన్సీలో టీమ్ ఇండియాకు ఇది మొదటి అంతర్జాతీయ మ్యాచ్ కావ‌డం విశేషం.

రింకూ సింగ్ చివర్లో సిక్సర్ కొట్టి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఛేద‌న‌లో భార‌త ఓపెన‌ర్‌లు ఇద్ద‌రూ త్వ‌ర‌గా పెవిలియ‌న్ చేరారు. దీంతో సూర్య‌కుమార్ యాద‌వ్‌(42 బంతుల్లో 80 ప‌రుగులు).. ఇషాన్ కిషన్‌(Ishan Kishan)తో కలిసి మూడో వికెట్‌కు 112 పరుగులు జోడించాడు. కిషన్ 39 బంతుల్లో 58 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో సిరీస్‌లో టీమిండియా 1-0తో ముందంజలో ఉంది. సూర్య 42 బంతుల్లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 80 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో రింకూ సింగ్ 14 బంతుల్లో అజేయంగా 22 పరుగులు చేసి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జ‌ట్టులో ఇంగ్లిష్(Josh Inglish) 110, స్టీవ్ స్మిత్(Steave Smith) 52 పరుగులతో రాణించ‌డంతో 3 వికెట్లకు 208 పరుగులు చేసింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 130 పరుగులు జోడించారు. భారత్ తరఫున రవి బిష్ణోయ్(Ravi Bishnoi), ప్రసిద్ధ్ కృష్ణ ఒక్కో వికెట్ తీసుకున్నారు. ముఖేష్ కుమార్(Mukesh Kumar) 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి అత్యంత పొదుపుగా బౌలింగ్ వేశాడు. బిష్ణోయ్ 4 ఓవర్లలో అత్యధికంగా 54 పరుగులు ఇచ్చాడు.

ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0తో ముందంజలో ఉంది. ఈ సిరీస్‌లోని రెండో మ్యాచ్ నవంబర్ 26న తిరువనంతపురంలో జరగనుంది. గ‌త మ్యాచ్‌లో జితేష్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అవేశ్ ఖాన్‌లకు అవకాశం దక్కలేదు.

Updated On 23 Nov 2023 10:22 PM GMT
Yagnik

Yagnik

Next Story