భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య జరిగిన‌ మూడు టీ20ల సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగింది.

భారత్(India), అఫ్గానిస్థాన్(Afghanistan) జట్ల మధ్య జరిగిన‌ మూడు టీ20ల సిరీస్‌లో మూడో, చివరి మ్యాచ్ బెంగళూరు(Bengaluru)లోని చిన్నస్వామి స్టేడియం(Chinnaswamy Stadium)లో జరిగింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా ఆఫ్ఘనిస్థాన్ కూడా 212 పరుగులు చేయగలిగింది. ఆ తర్వాత రెండు సూపర్ ఓవర్లు ఆడారు. చివరికి భారత్ గెలిచింది.

మూడు టీ20ల సిరీస్‌లో ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. తొలి, రెండో టీ20లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించిన టీమిండియా మూడో టీ20లో డబుల్ సూపర్ ఓవర్‌(Double Super Over)లో ఆఫ్ఘనిస్థాన్‌ను ఓడించింది. 20-20 ఓవర్లలో ఇరు జట్లు 212-212 పరుగులు చేయగలిగాయి. ఆ త‌ర్వాత‌ మొదటి సూపర్ ఓవర్‌లో ఇరు జట్లు 16-16 పరుగులు చేశాయి. అనంతరం డబుల్ సూపర్ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 11 పరుగులు చేసింది. బ‌దులుగా అఫ్గానిస్థాన్ జట్టు మూడు బంతుల్లోనే రెండు వికెట్లు కోల్పోవ‌డంతో భార‌త్‌ విజయం సాధించింది. రెండో సూపర్ ఓవర్‌లో రవి బిష్ణోయ్(Ravi Bishnoi) స్పిన్ భార‌త్‌కు విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టింది. బిష్ణోయ్ కేవలం మూడు బంతుల్లోనే మహ్మద్ నబీ(Mohmmad Nabi), రహ్మానుల్లా గుర్బాజ్‌(Rahmanulla Gurbaz)ల వికెట్లు తీశాడు. సూపర్ ఓవర్‌లో ఒక జట్టు రెండు వికెట్లు కోల్పోతే ఇన్నింగ్స్ ముగుస్తుంది. ఈ విజ‌యంతో భార‌త్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

అంత‌కుముందు రోహిత్ శ‌ర్మ‌(121), రింకూ సింగ్‌(69) ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగ‌డంతో భారత్ 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అనంత‌రం ఆఫ్ఘనిస్థాన్ జ‌ట్టులో గుర్బాజ్‌(50), జ‌ర్ధాన్‌(50), నైబ్‌(55), న‌బీ(34) రాణించ‌డంతో మ్యాచ్ టై అయ్యింది. చివ‌రికి డ‌బుల్ సూప‌ర్ ఓవ‌ర్‌లో భార‌త్ మ్యాచ్ నెగ్గింది.

Updated On 17 Jan 2024 8:57 PM GMT
Yagnik

Yagnik

Next Story