South Africa vs India : తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై టీమిండియా విక్టరీ..!
వన్డే సిరీస్‌ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కేఎల్ రాహుల్ సారథ్యంలోని భారత జట్టు తొలి వన్డేలో దక్షిణాఫ్రికాపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వన్డే సిరీస్(ODI Series)ను టీమిండియా(Teamindia) ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. కేఎల్ రాహుల్(KL Rahul) సారథ్యంలోని భారత జట్టు తొలి వన్డేలో దక్షిణాఫ్రికా(South Africa)పై 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆతిథ్య జట్టు బ్యాట్స్‌మెన్ అర్ష్‌దీప్(Arshdeep), అవేష్ ఖాన్(Avesh Khan)ల బౌలింగ్ ముందు నిలవలేకపోయారు. దీంతో దక్షిణాఫ్రిక జట్టు కేవలం 116 పరుగులకే కుప్పకూలింది. అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్(Sai Sudarshan)తో పాటు, సీనియర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ 117 పరుగుల లక్ష్యాన్ని 16.4 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి సులభంగా సాధించింది.
117 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు క్రీజులోకి వచ్చిన భారత జట్టుకు శుభారంభం లభించలేదు. రుతురాజ్ గైక్వాడ్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. అయితే, దీని తర్వాత సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్ ఇన్నింగ్సు బాధ్యతలు చేపట్టారు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. అయ్యర్ 45 బంతుల్లో 52 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఇన్నింగ్స్‌లో అయ్యర్ 6 ఫోర్లు, ఒక సిక్స్ బాదాడు. సాయి సుదర్శన్ 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చి వెనుదిరిగాడు.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణయం పూర్తిగా తప్పని తేలింది. అర్ష్‌దీప్ ఖాతా తెరవకుండానే రీజా హెండ్రిక్స్‌కు పెవిలియన్ చేరాడు. రాస్సీ వాన్ డెర్ డస్సెన్ కూడా సున్నా పరుగులకే ఔటయ్యాడు. టోనీ డిజోర్జీ 28 పరుగులు చేసిన అర్ష్‌దీప్ సింగ్‌కు మూడో బాధితుడు అయ్యాడు. కెప్టెన్ ఆడమ్ మార్క్రమ్(Aiden Markram) కూడా 12 పరుగులు, హెన్రిచ్ క్లాసెన్(Henrich Klassen) 6 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యారు. 2 పరుగుల వద్ద డేవిడ్ మిల్లర్(David Miller)ను అవేష్ ఖాన్ అవుట్ చేశాడు. ఇలా దక్షిణాఫ్రికా జట్టు మొత్తం 27.3 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది.
బౌలింగ్‌లో భారత్ తరఫున అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్ విధ్వంసం సృష్టించారు. అర్ష్‌దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే క్రికెట్‌లో ఐదు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా అర్ష్‌దీప్ నిలిచాడు. అదే సమయంలో అవేష్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 27 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత జట్టు 1-0 ఆధిక్యంలో నిలిచింది.