ప్రపంచకప్ 2023లో భాగంగా జ‌రిగిన‌ 21వ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.

ప్రపంచకప్(World Cup) 2023లో భాగంగా జ‌రిగిన‌ 21వ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌(New Zealand)పై భారత్(India) నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం భారత్‌కు 10 పాయింట్లు ఉన్నాయి. ధర్మశాల(Dharmashala)లోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 273 పరుగులు చేసింది. అనంత‌రం భారత్ ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

న్యూజిలాండ్‌పై భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో కివీ జట్టు తొలి ఓట‌మి చ‌విచూసింది. ఈ టోర్నీలో టీమ్ ఇండియా ఇప్పటికీ విజ‌యాల‌తో అజేయంగా ఉంది. ఈ విజయంతో భారత జట్టు 10 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. కివీస్‌ జట్టు పాయింట్ల పట్టిక(Points Table)లో రెండవ స్థానంలో ఉంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 50 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్(130 పరుగులు) సెంచ‌రీ చేశాడు. రచిన్ రవీంద్ర(Rachin Ravindra) 75 పరుగులు రాణించ‌గా.. గ్లెన్ ఫిలిప్స్ 23 పరుగులతో ప‌ర్వాలేద‌నిపించాడు. ఈ ముగ్గురు మినహా విల్ యంగ్(17 పరుగులు) మాత్రమే రెండంకెల స్కోరును దాటాడు. భారత్ తరఫున మహమ్మద్ షమీ(Mohammad Shami) ఐదు వికెట్లు, కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) రెండు వికెట్లు తీశారు. జస్ప్రీత్ బుమ్రా(Jaspreeth Bhumra), మహ్మద్ సిరాజ్(Mohammad Siraj) చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు.

భారత్ జ‌ట్టులో విరాట్ కోహ్లీ (95 పరుగులు) తృటిలో సెంచ‌రీ మిస్ చేసుకున్నాడు. రోహిత్ శర్మ(46 పరుగులు) చేయ‌గా.. రవీంద్ర జడేజా(39 పరుగులు) చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయాస్ 33 పరుగులు, రాహుల్ 27 పరుగులు, గిల్ 26 పరుగులు చేశారు. న్యూజిలాండ్‌ తరఫున లాకీ ఫెర్గూసన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. బౌల్ట్, హెన్రీ, సాంట్నర్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

Updated On 22 Oct 2023 8:46 PM GMT
Yagnik

Yagnik

Next Story