IND vs NZ Highlights : 'షమీ' ఫైనల్లో నెగ్గిన టీమిండియా.. టైటిల్‌కు అడుగుదూరంలో భారత్..!
ప్రపంచ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్ మ్యాచ్ వాంఖడే స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 70 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ప్రపంచ కప్(World Cup) 2023 మొదటి సెమీ-ఫైనల్(Semi-Final) మ్యాచ్ వాంఖడే స్టేడియంలో భారత్(India), న్యూజిలాండ్(Newzealand) జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి(Virat Kohli), శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) సెంచరీలు చేశారు. అనంతరం బౌలింగ్‌లో మహ్మద్ షమీ(Mohammad Shami) విధ్వంసం సృష్టించి ఏడు వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్.. న్యూజిలాండ్ పై సునాయాస విజయం దక్కించుకుంది. నాలుగేళ్ల తర్వాత ఇరు జట్లు మరోసారి సెమీఫైనల్‌లో తలపడ్డాయి. చివరిసారిగా 2019లో కివీ జట్టు కోట్లాది మంది భారతీయుల కలలను ఛేదించి ఫైనల్స్‌కు చేరుకుంది. ఈసారి న్యూజిలాండ్‌ను ఓడించి భారత్ మునుపటి ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.
దీంతో భారత జట్టు నవంబర్ 19న అహ్మదాబాద్‌లో ఫైనల్ ఆడనుంది. దక్షిణాఫ్రికా-ఆస్ట్రేలియా మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా కివీస్ జట్టు 48.5 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 327 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో న్యూజిలాండ్‌పై భారత్ 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా నాలుగోసారి ఫైనల్‌కు చేరింది.
భారత్ తరఫున విరాట్ కోహ్లీ అత్యధికంగా 117 పరుగులు చేశాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా 105 పరుగులతో రాణించాడు. శుభ్‌మన్ గిల్ 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. కెప్టెన్ రోహిత్(Rohit) 47 పరుగులు, లోకేశ్ రాహుల్(Lokesh Rahul) 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. న్యూజిలాండ్ తరఫున టిమ్ సౌథీ మూడు వికెట్లు, ట్రెంట్ బౌల్ట్ ఒక వికెట్ తీశారు.
న్యూజిలాండ్ తరఫున డారిల్ మిచెల్ 134 పరుగులు చేశాడు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ 69 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ 41 పరుగులు చేశాడు. కివీస్ ఓపెనర్లు కాన్వే, రచిన్ ఇద్దరూ 13 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నారు. భారత్ తరఫున మహమ్మద్ షమీ ఏడు వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.