India vs Pakistan : నేడు ఇండియా-పాక్ పోరు.. మ్యాచ్ గెలవాలంటే..
ఆసియా కప్-2023 మూడో మ్యాచ్ నేడు శ్రీలంకలోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్ తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు విజయంతో తమ ప్రస్తానాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది.
ఆసియా కప్(Asia Cup)-2023 మూడో మ్యాచ్ నేడు శ్రీలంక(Sri Lanka)లోని పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్‌లో భారత్(India) తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్(Pakistan)తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Sharma) నేతృత్వంలోని భారత జట్టు విజయంతో తమ ప్రస్తానాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంది. బౌన్స్, స్వింగ్‌కు అనుకూలంగా ఉండే ఈ పిచ్.. బ్యాట్స్‌మెన్‌కు కలిసొచ్చే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో పిచ్ బ్యాటింగ్‌కు సులువుగా మారుతుంది. దీంతో మ్యాచ్ విజయంలో టాస్ కీలక పాత్ర పోషించనుంది. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉండటం అందరినీ టెన్షన్ పెట్టే విషయం.
పాకిస్థాన్, నేపాల్(Nepal)తో జరిగిన మొదటి మ్యాచ్‌లో గెలిచి టోర్నమెంట్‌ను అద్భుతంగా ప్రారంభించింది. ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ బాబర్ ఆజం, ఇఫ్తికార్ సెంచరీలు చేశారు. పాక్ బౌలర్లు కూడా అద్భుత ప్రదర్శన చేశారు. 342 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు 104 పరుగులకే ఆలౌటయి 238 పరుగుల భారీ స్కోరుతో విజయం సాధించింది. పాకిస్థాన్ బౌలర్ షాదాబ్ ఖాన్ 4 వికెట్లు తీశాడు. దీంతో భారత్, పాక్ మ్యాచ్‌లో ఫామ్‌లో ఉన్న ఈ ముగ్గురు మరోసారి రాణిస్తే భారత్‌కు ఇబ్బందులు తప్పవు.
టీమిండియా ప్లేయింగ్-11
రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
పాకిస్థాన్ ప్లేయింగ్-11
బాబర్ ఆజం (సి), ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, మహ్మద్ రిజ్వాన్, ఇఫ్తీకర్ అహ్మద్, సల్మాన్ అఘా, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రవూఫ్