IND vs WI ODI series : నేటి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం.. యువ ఆటగాళ్లకు జట్టులో స్థానంపై రోహిత్ ఏమన్నాడంటే..
వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు.. ఇప్పుడు వన్డే సిరీస్‌పై ఫోకస్ పెట్టింది. తొలి వన్డే నేడు జరుగనుంది. అయితే ఈ ఏడాది ప్రపంచ కప్ జరుగనున్న నేపథ్యంలో.. చాలా మంది యువ ఆటగాళ్లు ఈ సిరీస్ ద్వారా తమను తాము నిరూపించుకునే సువర్ణావకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
వెస్టిండీస్(Westindies)తో టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు(Teamindia).. ఇప్పుడు వన్డే సిరీస్(Odi Series)పై ఫోకస్ పెట్టింది. తొలి వన్డే నేడు జరుగనుంది. అయితే ఈ ఏడాది ప్రపంచ కప్(Odi Worldcup0 జరుగనున్న నేపథ్యంలో.. చాలా మంది యువ ఆటగాళ్లు ఈ సిరీస్ ద్వారా తమను తాము నిరూపించుకునే సువర్ణావకాశం కోసం ఎదురుచూస్తున్నారు.
బార్బడోస్‌లోని కెల్లింగ్టన్ ఓవల్ మైదానంలో తొలి వన్డే మ్యాచ్(First ODI) జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు బీసీసీప(BCCI) తన అధికారిక ట్విట్టర్ ఖాతా(Twitter Account)లో ఒక వీడియోను పంచుకుంది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ప్రాముఖ్యతను వివరిస్తున్నాడు. మరి కెప్టెన్ రోహిత్ ఏం చెప్పాడో తెలుసుకుందాం.
ఈ సిరీస్ మాకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే చాలా మంది యువ ఆటగాళ్లు కొత్తవాళ్లు ఉన్నారు. వాళ్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. వాళ్లకు ఎక్స్‌పోజర్ ఇవ్వాలి. బ్యాటింగ్‌లో అవకాశం కల్పించాలి. వాళ్లు ఆ పాత్రను ఎలా సద్వినియోగం చేసుకున్నారో తెలుసుకునే అవకాశం కూడా వస్తుందని అన్నారు.
టీ20 ప్రపంచకప్‌లో కూడా మేము ఈ విషయాలపై చాలా శ్రద్ధ పెట్టామని రోహిత్ శర్మ(Rohit Sharma) చెప్పాడు. గత ఏడాది టీ20 ప్రపంచకప్(T20 World Cup)కు ముందు కూడా టీమ్‌లోకి వచ్చిన కొత్త కుర్రాళ్లకు అవకాశాలు కల్పించినట్లు చెప్పాడు. ఇక్కడ మూడు మ్యాచ్‌లు ఆడనున్నాం. మనం ఎవరికి అవకాశం ఇవ్వగలమో.. ఏమి చేయగలమో, ఏ నిర్ణయం తీసుకోవాలో చూద్దాం అని అన్నాడు.
వెస్టిండీస్ సిరీస్‌లో ముఖేష్(Mukesh)కు అరంగేట్రం చేసే అవకాశం వచ్చింది. ముఖేష్ 2 వికెట్లు పడగొట్టి తన ఆటతీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో వన్డే సిరీస్‌లో కెప్టెన్ రోహిత్.. ముఖేష్ కుమార్‌కు వన్డే క్యాప్(ODI CAP) కూడా అందజేయవచ్చని భావిస్తున్నారు.
భారత వన్డే జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్య కుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనద్కత్, యజ్వేంద్ర చాహల్, ఉమ్రాన్ మాలిక్ ముఖేష్ కుమార్.