భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియాపై ఆఫ్రికా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది.

భారత్-దక్షిణాఫ్రికా(India vs Southafrica) మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన రెండో మ్యాచ్‌లో టీమిండియా(Teamindia)పై ఆఫ్రికా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. Gqberahలోని సెయింట్ జార్జ్ పార్క్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్(aiden Markram) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన‌ భారత జట్టు 46.2 ఓవర్లలో 211 పరుగులకే కుప్పకూలింది. అనంత‌రం టోనీ డిజార్జ్ సెంచరీతో దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 212 పరుగుల లక్ష్యాన్ని చేధించి సిరీస్‌ను సమం చేసింది.

దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసి విజయం సాధించింది. దక్షిణాఫ్రికా తరఫున టోనీ డిజార్జ్ బ్యాట్‌తో అద్భుతాలు చేసి అజేయంగా 119 పరుగులు చేశాడు. అత‌నికి తోడు జ‌ట్టు విజ‌యానికి రీజా హెండ్రిక్స్ 52 పరుగులు, రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 36 పరుగులు అందించారు. ఆఫ్రికన్ జట్టులో నాండ్రే బెర్గర్ బంతితో అత్యధికంగా మూడు వికెట్లు పడగొట్టాడు. హెండ్రిక్స్, కేశవ్ మహరాజ్(Keshav Maharaj) చెరో రెండు వికెట్లు తీశారు. విలియమ్స్‌(Williams)-మార్క్‌రామ్‌(Markram)లకు ఒక్కో వికెట్ దక్కింది.

భారత్ తరఫున సాయి సుదర్శన్(Sai Sudharshan) 62 పరుగులు, కెప్టెన్ రాహుల్(Lokesh Rahul) 56 పరుగులు చేశారు. వీరిద్దరూ మినహా ఏ భారత బ్యాట్స్‌మెన్ ఆక‌ట్టుకోలేక‌పోయారు. ఈ కారణంగా టీమ్ ఇండియా 50 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్(Arshdeep Singh) ఒక‌ వికెట్ తీశాడు. సిరీస్ 1-1తో స‌మం కావ‌డంతో మూడో మ్యాచ్‌లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇరు జ‌ట్లు భావిస్తున్నాయి.

Updated On 19 Dec 2023 10:06 PM GMT
Yagnik

Yagnik

Next Story