South Africa vs India 2nd Test : సఫారీ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించిన భారత బౌలర్లు..!
భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో రెండో, చివరి మ్యాచ్ కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరుగుతోంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా
భారత్-దక్షిణాఫ్రికా(South Africa vs India) జట్ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో రెండో, చివరి మ్యాచ్ కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్ మైదానంలో జరుగుతోంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ డీన్ ఎల్గర్(Dean Elgar) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోగా తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 55 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీనికి సమాధానంగా భారత్ తొలి ఇన్నింగ్సులో 153 పరుగులకు ఆలౌటై 98 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 62/3 స్కోరు వద్ద నిలిచింది. తొలి ఇన్నింగ్స్ ఆధారంగా భారత్ 36 పరుగుల ఆధిక్యంలో ఉంది. సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టులో విజయం సాధించిన దక్షిణాఫ్రికా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టులో గెలిచి సిరీస్‌ను సమంగా ముగించాలని టీమ్ ఇండియా భావిస్తోంది.
ఐడెన్ మార్క్రామ్(Aiden Markram) 36 పరుగులతో, డేవిడ్ బెడింగ్ హామ్ ఏడు పరుగులతో ఆడుతున్నారు. భారత్ ఇంకా 36 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికాకు ఏడు వికెట్లు మిగిలి ఉన్నాయి. భారత్ తరఫున రెండో ఇన్నింగ్స్‌లో ముఖేష్ కుమార్(Mukesh Kumar)రెండు వికెట్లు తీయగా, జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bhumra) ఒక వికెట్ తీశారు. 12 పరుగుల వద్ద డీన్ ఎల్గర్ అవుటయ్యాడు. టోనీ డిజార్జ్, ట్రిస్టన్ స్టబ్స్ ఒక్కో పరుగు చేసి వెనుదిరిగారు.
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన చేశారు. మహ్మద్ సిరాజ్(Mohammed Siraj) అత్యధికంగా ఆరు వికెట్లు తీశాడు. జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్ చెరో రెండు వికెట్లు తీశారు. భారత బౌలర్లు ధాటికి కేవలం ఇద్దరు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరును అందుకోగలిగారు. కైల్ వెర్న్ 15 పరుగులు, డేవిడ్ బెడింగ్‌హామ్ 12 పరుగులు చేశారు. ఐడెన్ మార్క్రామ్ (2 పరుగులు), డీన్ ఎల్గర్ (4 పరుగులు), టోనీ డిజార్జ్ (2 పరుగులు), ట్రిస్టన్ స్టబ్స్ (3 పరుగులు), మార్కో జాన్సెన్ (0 పరుగులు), కేశవ్ మహరాజ్ (3 పరుగులు), కగిసో రబడ (5 పరుగులు), నాంద్రే బెర్గర్ ఔట్ (4 పరుగులు) తో అంతా విఫలమయ్యారు.
భారత్ తొలి ఇన్నింగ్స్ 153 పరుగుల వద్ద ముగిసింది. కేవలం ముగ్గురు భారత బ్యాట్స్‌మెన్ మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. కెప్టెన్ రోహిత్ 39 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. రోహిత్(Rohit Sharma)(39), శుభ్‌మన్ గిల్(Shubhman Gill) 36 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ(Virat Kohli) 46 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా తరఫున కగిసో రబడ(Kagiso Rabada), లుంగి ఎన్‌గిడి, నాండ్రే బెర్గర్‌లు తలా మూడు వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు 98 పరుగుల ఆధిక్యం లభించింది.