ధర్మశాలలోని హెచ్‌పిసిఎ స్టేడియంలో గురువారం, మార్చి 7 నుండి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదవ టెస్ట్‌

ధర్మశాలలోని హెచ్‌పిసిఎ స్టేడియంలో గురువారం, మార్చి 7 నుండి భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదవ టెస్ట్‌ జరగనుంది. ఐదు గేమ్‌ల టెస్ట్ సిరీస్‌ ను ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు కోల్పోగా.. ఆఖరి టెస్ట్ మ్యాచ్ లో అయినా గెలవాలని ఇంగ్లండ్ భావిస్తూ ఉంది. ఇక ఆఖరి మ్యాచ్ లో కూడా గెలిచేసి.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో స్థానాన్ని మరింత మెరుగు పరుచుకోవాలని భారత్ భావిస్తోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఇప్పటికే సిరీస్‌లోని రెండవ, మూడవ, నాల్గవ టెస్టులను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆఖరి టెస్టు సమీపిస్తున్న తరుణంలో ధర్మశాలలో జరిగే పోరుకు సంబంధించి వాతావరణ సమాచారం అందరికీ షాక్ ఇస్తోంది. భారత్ - ఇంగ్లండ్ మధ్య జరిగే ఐదవ టెస్ట్ ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా అనేక అంతరాయాలను ఎదుర్కొనే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఉష్ణోగ్రత 1 డిగ్రీ సెల్సియస్ కంటే తక్కువగా పడిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు.. ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే మ్యాచ్ జరిగే అవకాశాలు చాలా తక్కువే ఉంటాయి.

ధర్మశాల ఎత్తైన ప్రదేశం. ఈ సమయంలో టెస్ట్ మ్యాచ్‌ని సజావుగా నిర్వహించాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. ఐదవ టెస్టు జరిగే సమయంలో నగరంలో మంచు కురుస్తుందని వాతావరణ శాఖ సూచించింది. ఈ సంవత్సరం ప్రారంభంలో భారత జట్టు మొహాలీలో ఒక గేమ్‌లో ఫీల్డింగ్ చేయడానికి ఇబ్బంది పడింది. అక్కడ ఉష్ణోగ్రత 10 ° సెల్సియస్‌కు పడిపోయింది. ధర్మశాలలో ఉష్ణోగ్రత 1 డిగ్రీకి పడిపోవడంతో మ్యాచ్ జరిగే అవకాశం ఉండదు. వైజాగ్, రాజ్‌కోట్, రాంచీలలో అద్భుత ప్రదర్శన చేస్తూ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను టీమిండియా ఇప్పటికే కైవసం చేసుకుంది.

Updated On 4 March 2024 12:49 AM GMT
Yagnik

Yagnik

Next Story