India vs Pakistan : పాకిస్థాన్‌ను చిత్తు చేసిన టీమిండియా
వన్డే ప్రపంచకప్‌లో శనివారం భారత్-పాక్‌ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా చాలా సులభంగా గెలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్(World CUp)లో శనివారం భారత్-పాక్(India-Pakistan)ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా(Teamindia) చాలా సులభంగా గెలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం(Narendra Modi Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విజయంతో భారత జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి చేరుకుంది.
ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన పాక్ జట్టు 42.5 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. అనంతరం భారత్ 30.3 ఓవర్లలో మూడు వికెట్లకు 192 పరుగులు చేసి విజయం సాధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 86 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అదే సమయంలో జస్ప్రీత్ బుమ్రా(Jaspreet Bumra) ఏడు ఓవర్లలో 19 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్(Player Of The Match)గా ఎంపికయ్యాడు.
అంతకుముందు పాక్ తరఫున కెప్టెన్ బాబర్ ఆజం(Babar Azam) అత్యధికంగా 50 పరుగులు చేశాడు. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన మహ్మద్ రిజ్వాన్ 49 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇమామ్ ఉల్ హక్ 36, అబ్దుల్లా షఫీక్ 20, హసన్ అలీ 12 పరుగులు చేశారు. సౌద్ షకీల్ ఆరు పరుగులు, మహ్మద్ నవాజ్ నాలుగు, ఇఫ్తికర్ అహ్మద్ నాలుగు, షదాఖ్ ఖాన్ రెండు, హరీస్ రవూఫ్ రెండు పరుగులు చేసి ఔట్ అయ్యారు.
టీమిండియా బౌలర్లలో ఐదుగురు బౌలర్లు తలా రెండు వికెట్ల చొప్పున తీశారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తలో రెండు వికెట్లు తీశారు. బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.