India Vs England : నిప్పులు చెరిగిన భారత బౌలర్లు.. డిఫెండింగ్ ఛాంపియన్‌కు మరో ఓటమి
వన్డే ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన 29వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను భారత్ 100 పరుగుల తేడాతో ఓడించింది. లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

IND defeat ENG by 100 runs, set sight on semifinals
వన్డే ప్రపంచకప్(World Cup)లో భాగంగా జరిగిన 29వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్(England)ను భారత్(India) 100 పరుగుల తేడాతో ఓడించింది. లక్నో(Lucknow)లోని ఎకానా స్టేడియం(Ekana Stadium)లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్(Jos Buttler) బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 229 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన ఇంగ్లండ్ 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. టోర్నీలో టీమిండియా(TeamIndia) వరుసగా ఆరో విజయం సాధించగా.. ఆరు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌కు ఇది ఐదో ఓటమి. ప్రస్తుతం భారత జట్టు సెమీఫైనల్‌కు చేరువలో ఉండగా.. ఇంగ్లండ్ జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించే దశలో ఉంది.
20 ఏళ్ల తర్వాత ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై భారత్‌కు ఇదే తొలి విజయం. 2003లో చివరిసారి ఇంగ్లండ్‌పై భారత్ విజయం సాధించింది. ఆ తర్వాత 2011లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అయింది. 2019లో టీమిండియా ఇంగ్లాండ్‌పై ఓటమి చవిచూసింది.
భారత్ నిర్దేశించిన 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లాండ్.. 34.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లు అద్భుత ప్రదర్శన ముందు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ నిలదొక్కుకోలేకపోయారు. న్యూజిలాండ్‌పై ఐదు వికెట్లు తీసిన మహ్మద్ షమీ(Mohammed Shami).. ఈ మ్యాచ్‌లో కూడా అద్భుతమైన బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. జస్ప్రీత్ బుమ్రా(Jaspreeth Bumra) మూడు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాదవ్(Kuldeep Yadav) రెండు వికెట్లు, రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఒక వికెట్ పడగొట్టారు.
భారత బౌలర్లు వరుసగా వికెట్లు తీస్తూ ఇంగ్లండ్‌ను ఒత్తిడిలో పడేశారు. జో రూట్(Joe Root), బెన్ స్టోక్స్(Ben Stokes) వంటి వెటరన్లతో పాటు మార్క్ వుడ్(Mark Wood) కూడా ఖాతా తెరవలేకపోయాడు. ఇంగ్లండ్ తరఫున లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livinstone) ఒక్కడే 20 పరుగుల మార్కును అధిగమించాడు. అతను అత్యధికంగా 27 పరుగులు చేశాడు. డేవిడ్ మలన్(David Malan) 16, డేవిడ్ విల్లీ 16 నాటౌట్, మొయిన్ అలీ 15, జానీ బెయిర్‌స్టో 14, ఆదిల్ రషీద్ 13, జోస్ బట్లర్(10), క్రిస్ వోక్స్ (10) పరుగులు చేశారు. అంతకుముందు భారత ఇన్నింగ్సులో రోహిత్ శర్మ(87), కేఎల్ రాహుల్(39), సూర్యకుమార్ యాదవ్(49) పరుగులు చేశారు.
