భారత్, ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జ‌రిగిన‌ నాలుగో మ్యాచ్‌లో భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో టీమ్‌ఇండియా 3-1తో అజేయంగా నిలిచి.. ఒక మ్యాచ్ మిగిలుండ‌గానే టైటిల్ విన్న‌ర్‌గా నిలిచింది.

భారత్, ఆస్ట్రేలియా(IND vs AUS) మధ్య జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జ‌రిగిన‌ నాలుగో మ్యాచ్‌లో భారత్(Teamindia) 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో టీమ్‌ఇండియా 3-1తో అజేయంగా నిలిచి.. ఒక మ్యాచ్ మిగిలుండ‌గానే టైటిల్ విన్న‌ర్‌గా నిలిచింది. రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జ‌రిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా(Australia) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్(India) 174 పరుగులు చేసింది. అనంత‌రం కంగారూ జట్టు 154 పరుగులకే కుప్పకూలి మ్యాచ్‌తో పాటు సిరీస్‌ను కోల్పోయింది.

ఆస్ట్రేలియాపై భారత్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్‌ సిరీస్‌ కూడా కైవసం చేసుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 3-1తో తిరుగులేని ఆధిక్యం సాధించింది. సిరీస్‌లో ఐదో, చివరి మ్యాచ్ డిసెంబర్ 3న బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.

భారత్ తరఫున రింకూ సింగ్(Rinku Singh) అత్యధికంగా 46 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్(Yashaswi Jaishwal) 37 పరుగులు, జితేష్ శర్మ(Jithesh Sharma) 35 పరుగులు చేశారు. రుతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad) 32 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో బెన్ డ్వ‌రాషిష్‌ మూడు వికెట్లు తీయగా, తన్వీర్ సంఘా-జాసన్ బెహ్రెండార్ఫ్ త‌లా రెండు వికెట్లు తీశారు. ఆరోన్ హార్డీకి ఒక వికెట్ దక్కింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా చివరి రెండు ఓవర్లలో 13 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయింది. ఈ కారణంగా భారత్ స్కోరు 200 పరుగులకు చేరువ కాలేదు.

ఆస్ట్రేలియా తరఫున కెప్టెన్ మాథ్యూ వేడ్(Mathew Wade) అత్యధికంగా అజేయంగా 36 పరుగులు చేశాడు. ట్రావిస్ హెడ్(Travis Head) 31 పరుగులు, మాథ్యూ షార్ట్(Mathew Short) 22 పరుగులు అందించారు. బెన్ మెక్‌డెర్మాట్, టిమ్ డేవిడ్ చెరో 19 పరుగులు చేశారు. భారత్ విజయంలో స్పిన్న‌ర్లు కీల‌క పాత్ర పోషించారు. ఆస్ట్రేలియా తొలి నాలుగు వికెట్లను భారత స్పిన్నర్లు తీశారు. అక్షర్ పటేల్ మూడు వికెట్లు, దీపక్ చాహర్ రెండు వికెట్లు తీశారు. రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్ చెరో వికెట్ తీశారు. స్పిన్నర్లు చాలా పొదుపుగా బౌలింగ్ చేయడంతో విజ‌యం సులువైంది. అక్షర్-రవి కలిసి ఎనిమిది ఓవర్లలో 33 పరుగులు మాత్ర‌మే ఇచ్చి నాలుగు వికెట్లు తీశారు.

Updated On 1 Dec 2023 9:47 PM GMT
Yagnik

Yagnik

Next Story