హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో పురుషుల క్రికెట్‌ తొలి సెమీఫైనల్‌లో బంగ్లాదేశ్‌పై భారత్‌ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా ఫైనల్‌కు చేరి రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో భారత్‌ ఫైనల్‌లో తలపడనుంది.

హాంగ్‌జౌ ఆసియా క్రీడల్లో(Asia Games) పురుషుల క్రికెట్‌ తొలి సెమీఫైనల్‌(First Semifinal)లో బంగ్లాదేశ్‌(Bangladesh)పై భారత్‌(India) తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టీమిండియా ఫైనల్‌కు చేరి రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. ఆఫ్ఘనిస్థాన్‌(Afghanistan)-పాకిస్థాన్‌(Pakistan) జట్ల మధ్య జరిగే మ్యాచ్‌లో విజేతతో భారత్‌ ఫైనల్‌(Final)లో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొమ్మిది వికెట్లకు 96 పరుగులు చేసింది. అనంత‌రం టీమిండియా ఒక వికెట్ నష్టానికి 97 పరుగులు చేసి విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్‌ ఎంచుకున్నాడు. బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత వ్యవధిలో వికెట్లు కోల్పోయి 96 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ తరఫున జకీర్ అలీ(Zakeer Ali) అత్యధికంగా అజేయంగా 24 పరుగులు చేశాడు. పర్వేజ్ హుస్సేన్(Farvez Hussain) 23 పరుగులు చేశాడు. వీరిద్దరూ కాకుండా రకీబుల్ హసన్ (14 పరుగులు) మాత్రమే రెండంకెల స్కోరును దాటగలిగాడు. బంగ్లాదేశ్‌లో ఏడుగురు బ్యాట్స్‌మెన్ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు. ఇద్దరు బ్యాట్స్‌మెన్ ఖాతా కూడా తెరవలేకపోయారు. భారత్ తరఫున రవి సాయి కిషోర్(Ravi Sai Kishaore) మూడు వికెట్లు తీశాడు. వాషింగ్టన్‌ సుందర్‌(Washington Sundar)కు రెండు వికెట్లు దక్కాయి. అర్ష్‌దీప్‌ సింగ్‌(Arshadeep Singh), తిలక్‌ వర్మ(Thilak Varma), రవి బిష్ణోయ్‌(Ravi Bishnoi), షాబాజ్‌ అహ్మద్‌లకు ఒక్కో వికెట్ దక్కింది.

97 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే షాక్ త‌గిలింది. గత మ్యాచ్‌లో సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. అనంత‌రం తిలక్ వర్మ, రితురాజ్ గైక్వాడ్ వికెట్ కోల్పోకుండా జాగ్ర‌త్త‌గా పరుగులు సాధించారు. దీంతో నాలుగో ఓవర్‌లోనే భారత్ స్కోరు 50 పరుగులకు చేరుకుంది. తొమ్మిదో ఓవర్లో తిలక్ అర్ధసెంచరీ పూర్తి చేశాడు. అనంత‌రం భారత్ 9.2 ఓవర్లలో 97 పరుగులు చేసి విజయం సాధించింది. తిలక్ వర్మ 26 బంతుల్లో 55 పరుగులతో, రితురాజ్ గైక్వాడ్ 26 బంతుల్లో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. బంగ్లాదేశ్‌లో రిపన్ మొండల్ ఏకైక వికెట్ తీశాడు.

Updated On 5 Oct 2023 11:14 PM GMT
Yagnik

Yagnik

Next Story