ICC Trpohy 2025 : మంకు పట్టు పడితే పాక్ కే నష్టం!
2025లో జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీపై(ICC Champions trophy) ఇంకా స్పష్టత రాలేదు.
2025లో జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీపై(ICC Champions trophy) ఇంకా స్పష్టత రాలేదు. పాకిస్తాన్(Pakistan) కు భారత జట్టు వెళ్లకూడదని అనుకుంది.. పాకిస్తాన్ ఏమో హైబ్రిడ్ మోడల్‌కు(Hybrid Model) ఒప్పుకోవడం లేదు. దాంతో, అంతర్జాతీయ క్రికెట్ మండలి నవంబర్ 11వ తేదిన జరగాల్సిన చాంపియన్స్ ట్రోఫీని రద్దు చేసింది. ఆ తర్వాతి రోజు బీసీసీఐ(BCCI) అభ్యంతరాలు ఏంటో తమకు చెప్పండని ఐసీసీని పీసీబీ కోరింది.ఒకవేళ హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ(PCB) అంగీకరించకుంటే దక్షిణాఫ్రికాలో(South Africa) టోర్నీని జరపాలని ఐసీసీ ఆలోచిస్తోంది. మొత్తంగా పాకిస్తాన్ కే దెబ్బ పడేట్టుగా ఉంది. చాంపియన్స్ ట్రోఫీ 2025 ఆతిథ్యం హక్కులు దక్కించుకున్న పాకిస్తాన్ అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఈ టోర్నీని సజావుగా నిర్వహించడం కోసం ఐసీసీ పాక్ బోర్డుకు రూ.548 కోట్లు కేటాయించింది.దాంతో, సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీని విజయవంతంగా పూర్తి చేసి భారీగా డబ్బులు సమకూర్చుకోవాలి అనుకున్న పాకిస్తాన్ న్ క్రికెట్ బోర్డు అనుకుంది. అయితే బీసీసీఐ ఇచ్చిన షాక్‌తో అంతా రివర్స్ అయింది. హైబ్రిడ్ మోడల్‌కు ఓకే చెబితేనే పాక్‌లో చాంపియన్స్ ట్రోఫీ జరిగే వీలుంది.ఐసీసీ సూచించినట్టు హైబ్రిడ్ మోడల్‌కు పాక్ అంగీకరించాలి. అప్పుడు టీమిండియా మ్యాచ్‌లు తటస్థ వేదికైన యూఏఈలో జరుగుతాయి. అలా కాదంటే మాత్రం టోర్నీని దక్షిణాఫ్రికాకు తరలించేందుకు ఐసీసీ రెడీగా ఉంది. అదే జరిగితే మెగా టోర్నీ ఆతిథ్యం కింద పీసీబీకి ఐసీసీ కేటాయించిన 548 కోట్ల రూపాయలు వెనక్కి ఇచ్చేయాల్సి ఉంటుంది.