కొన్ని రోజుల్లో పాకిస్తాన్‌ వేదికగా జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఐసీసీ బిగ్‌ ప్రైజ్‌ మనీ ప్రకటించింది.

కొన్ని రోజుల్లో పాకిస్తాన్‌ వేదికగా జరగనున్న ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం ఐసీసీ బిగ్‌ ప్రైజ్‌ మనీ ప్రకటించింది. భారత్ ఆడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్‌(dubai) వేదికగా జరగనున్నాయి. ఈ క్రమంలో సుమారు రూ.60 కోట్ల ప్రైజ్‌మనీని అన్నీ టీమ్‌లకు ఐసీసీ పంచనుంది. అలా చివరి ప్లేస్‌లో నిలిచిన జట్టుకు కూడా రూ.1.22 కోట్ల మేరకు దక్కించుకునే అవకాశం ఉంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కో మ్యాచ్‌కు సుమారు రూ.29 లక్షలు అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. విన్నర్ టీం​ ప్రైజ్‌మనీ : రూ. 20.8 కోట్లు, రన్నరప్​ టీం ప్రైజ్‌మనీ: రూ. 10.4 కోట్లు ప్రకటించారు. సెమీఫైనల్‌ చేరిన జట్లకు రూ. 5.2 కోట్లు చొప్పున.. ఐదు, ఆరు స్థానాల టీమ్స్​ : రూ.3 కోట్లు చొప్పున ప్రకటించారు. ఏడు, ఎనిమిది స్థానాల టీమ్స్​ : రూ.1.2 కోట్లు ప్రకటించారు. ప్రతి మ్యాచ్‌కు ప్రైజ్‌మనీ రూ.29 లక్షలు ఇచ్చారు.

ehatv

ehatv

Next Story