పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ప్రయాణం ముగిసింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 5 కాంస్యం, ఒక రజత పతకంతో సహా మొత్తం 6 పతకాలు సాధించింది.

పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ ప్రయాణం ముగిసింది. 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 5 కాంస్యం, ఒక రజత పతకంతో సహా మొత్తం 6 పతకాలు సాధించింది. రితికా హుడా 76 కిలోల రెజ్లింగ్ ఫ్రీస్టైల్ ఈవెంట్‌లో సెమీ-ఫైనల్‌లో కిర్గిజ్‌స్థాన్ రెజ్లర్ అపరి కైజీ చేతిలో ఓడి పతక రేసు నుండి నిష్క్రమించింది. ఒకవేళ కిర్గిస్థాన్ రెజ్లర్ ఫైనల్స్‌కు చేరి ఉంటే రితికా కాంస్య పతకం కోసం మ్యాచ్‌ ఆడే అవకాశం ఉండేది. 6 పతకాలు గెలిచిన భారత్.. ఒలింపిక్ పతకాల పట్టికలో ఏ స్థానంలో నిలిచిందో తెలుసుకుందాం.

పారిస్ ఒలింపిక్స్ 2024లో షూటర్ మను భాకర్ భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌లో మను భాకర్‌ కాంస్య పతకం సాధించింది. దీని తర్వాత మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో సరబ్‌జోత్ సింగ్‌తో కలిసి మను భాకర్ భారత్‌కు రెండో కాంస్య పతకాన్ని అందించింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్ షూటింగ్‌లో స్వప్నిల్ కుసాలే భారత్‌కు మూడో కాంస్య పతకాన్ని అందించాడు. ఆపై పురుషుల హాకీ జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా రజత పతకం సాధించాడు. ఆ తర్వాత పురుషుల 57 కేజీల ఫ్రీస్టయిల్‌లో రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు.

ఒలింపిక్ 2024 పతక పట్టిక చూస్తే.. మొత్తం 90 పతకాలను గెలుచుకున్న చైనా అగ్రస్థానంలో ఉంది. ఒక బంగారు పతకం సాధించిన పాకిస్థాన్‌.. భారత్‌ కంటే పతకాల పట్టికలో ముందుంది. పాకిస్థాన్‌కు చెందిన అర్షద్ నదీమ్ స్వర్ణ పతకాన్ని సాధించడం ద్వారా భారత్‌ కంటే పాకిస్థాన్‌ను ముందంజలో ఉంచాడు. భారత్ 5 కాంస్యం, ఒక రజతంతో పతకాల పట్టికలో 71వ స్థానంలో నిలిచింది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story