ఐపీఎల్‌-2023లో 66వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. సంజూ శాంసన్‌ నేతృత్వంలోని రాజస్థాన్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. శిఖర్‌ ధావన్‌ నేతృత్వంలోని పంజాబ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐతే.. రాజస్థాన్ జట్టు 14 మ్యాచ్‌లు పూర్త‌వ‌గా.. ఇతర మ్యాచ్‌ల ఫ‌లితాల వైపు చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది.

ఐపీఎల్‌-2023లో 66వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab KIngs), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మధ్య జరిగింది. సంజూ శాంసన్‌(Sanju Samson) నేతృత్వంలోని రాజస్థాన్‌ 4 వికెట్ల తేడాతో విజయం సాధించగా.. శిఖర్‌ ధావన్‌(Shikhar Dawan) నేతృత్వంలోని పంజాబ్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఐతే.. రాజస్థాన్ జట్టు 14 మ్యాచ్‌లు పూర్త‌వ‌గా.. ఇతర మ్యాచ్‌ల ఫ‌లితాల వైపు చూడాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ సీజన్‌లోని చివరి నాలుగు లీగ్ మ్యాచ్‌లు శని, ఆదివారాల్లో జరగనున్నాయి.

టాస్‌ ఓడిన పంజాబ్‌కు శుభారంభం ద‌క్క‌లేదు. పవర్‌ప్లేలోనే మూడు వికెట్లు పడ్డాయి. ట్రెంట్ బౌల్ట్(trent Boult) తొలి ఓవర్‌లోనే ప్రభ్‌సిమ్రిన్ సింగ్‌(Prabhsimran Singh)ను పెవిలియన్‌కు పంపాడు. జితేష్ శర్మ(Jithesh Sharma) 44 పరుగులు, సామ్ కరణ్(Sam Curran) 49 ప‌రుగులు, షారుక్ ఖాన్(Sharukh Khan) 41 పరుగులు చేయ‌డంతో 20 ఓవ‌ర్లో జట్టు స్కోరు 187 పరుగులకు చేరుకుంది. చివరి రెండు ఓవర్లలోనే రాజస్థాన్ 46 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్ల‌లో నవదీప్ సైనీ(Navadeep Saini) మూడు వికెట్లు పడగొట్టాడు.

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్సు ఆరంభంలోనే జోస్ బట్లర్ అవుటయ్యాడు. దేవదత్ పడిక్కల్, యశస్వి జైస్వాల్ అర్ధ సెంచరీలతో అద‌ర‌గొట్టారు. కెప్టెన్ సంజూ శాంసన్ 2 పరుగులు మాత్ర‌మే చేశాడు. చివ‌ర్లో షిమ్రాన్ హెట్మెయర్ 28 బంతుల్లో 46 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. పంజాబ్‌లో బౌల‌ర్లో ర‌బాడ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

Updated On 19 May 2023 9:07 PM GMT
Yagnik

Yagnik

Next Story