Gujarat Titans vs Rajasthan Royals : గుజరాత్ టైటాన్స్ పై రాజస్థాన్ రాయల్స్ సూపర్ విక్టరీ..!
ఐపీఎల్-2023లో 23వ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్(Sanju Samson) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. డేవిడ్ మిల్లర్(David Miller) రాణించడంతో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్‌కు 178 పరుగుల విజయ లక్ష్యాన్ని ముందుంచింది. రాజస్థాన్ జట్టు 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాజస్థాన్ తరఫున షిమ్రాన్ హెట్మెయర్, కెప్టెన్ సంజూ శాంసన్ రాణించారు.

ఛేదనకు దిగిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ 1 పరుగు, జోస్ బట్లర్(Jos Buttler) ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరుకున్నారు. తర్వాత దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. 13వ ఓవర్లో సంజూ భారీ స్ట్రోక్స్ కొట్టడంతో మ్యాచ్ రాజస్థాన్ వైపు మళ్లింది. సంజూ 32 బంతుల్లో 60 పరుగులు చేశాడు. దేవదత్ 26 పరుగులు చేశాడు. ఆఖర్లో షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ ధీటైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించారు. షిమ్రాన్ హెట్మెయర్ 56 పరుగులతో ఇన్నింగ్స్ ఆడాడు. రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Aswin) 3 బంతుల్లో 10 పరుగులు చేశాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున మహ్మద్ షమీ(Mohmmad Shami) అత్యధికంగా 3 వికెట్లు పడగొట్టాడు. రషీద్ ఖాన్ 2 వికెట్లు పడగొట్టాడు. నూర్ అహ్మద్, హార్దిక్ పాండ్యా(Hardik Pandya) ఒక్కో వికెట్ సాధించారు.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్సు పేలవంగా ఆరంభించింది. వృద్ధిమాన్ సాహా(Vriddiman Saha) కేవలం 4 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్(Saisudharshan) కాసేపు క్రీజులో ఉన్నారు. గిల్ 45 పరుగులు చేశాడు. సుదర్శన్ 20 పరుగులు చేశాడు. హార్దిక్ పాండ్యా 28 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో డేవిడ్ మిల్లర్ వేగంగా బ్యాటింగ్ చేశాడు. మిల్లర్ 30 బంతుల్లో 46 పరుగులు చేశాడు. అభినవ్ మనోహర్ 27 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ టైటాన్స్ 177 పరుగులు చేసింది. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు జరగ్గా.. మూడు మ్యాచ్‌ల్లో గుజరాత్ జట్టు విజయం సాధించింది. ఒక మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు విజయం సాధించింది.