జింబాబ్వే క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, గొప్ప ఆల్ రౌండర్లలో ఒకడైన హీత్ స్ట్రీక్(49) బుధవారం మరణించాడు. హీత్ స్ట్రీక్‌ నాల్గవ దశ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం కూడా జింబాబ్వే క్రీడా మంత్రి ఓ ప్ర‌క‌ట‌న ద్వారా ఈ విష‌యాన్ని వెళ్ల‌డించాడు.

జింబాబ్వే(Zimbabwe) క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, గొప్ప ఆల్ రౌండర్లలో ఒకడైన హీత్ స్ట్రీక్(Heath Streak)(49) బుధవారం మరణించాడు. హీత్ స్ట్రీక్‌ నాల్గవ దశ క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. కొద్దిరోజుల క్రితం కూడా జింబాబ్వే క్రీడా మంత్రి ఓ ప్ర‌క‌ట‌న ద్వారా ఈ విష‌యాన్ని వెళ్ల‌డించాడు. కొంతకాలం క్రితం తనతో కలిసి చేపల వేటకు వెళ్లానని.. ఇప్పుడు పరిస్థితులు సరిగా లేవని అతని స్నేహితుల్లో ఒకరు చెప్పారు. స్ట్రీక్ కెరీర్ మొత్తం సవాళ్లతో నిండిపోయింది.. అతడు ఎల్లప్పుడూ దృఢ సంకల్పంతో ఎదుర్కొన్నాడని జింబాబ్వే క్రీడా మంత్రి పేర్కొన్నారు.

నవంబర్ 1993లో హీత్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతని మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికా(South Africa)తో చిన్నస్వామి స్టేడియం(Chinna Swamy Stadium)లో జరిగిన వన్డే. దీని తర్వాత హీత్ డిసెంబర్ 1993లో పాకిస్థాన్‌(Pakistan)పై తన టెస్టు అరంగేట్రం చేశాడు. హీత్ స్ట్రీక్ అద్భుతమైన ఫాస్ట్ బౌలర్.. బ్యాట్‌తో కూడా వేగంగా పరుగులు చేయడంలో నిపుణుడు. 1990-2000 మధ్య జింబాబ్వే జట్టు అంతర్జాతీయ క్రికెట్‌లో బాగా రాణించింది. హీత్ స్ట్రీక్ కూడా అప్ప‌టి జట్టులో సభ్యుడు.

తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ భారత్‌(India)తో ఆడాడు. ఆ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో హీత్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. భారత జట్టులో సగం మందిని పెవిలియన్‌కు పంపాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో హీత్ 32 ఓవర్లలో 73 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. అయితే అతడు అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ఆ మ్యాచ్‌లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

హీత్ తన కెరీర్‌లో 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 1,990 పరుగులు చేసి 216 వికెట్లు తీశాడు. వన్డేల్లో స్ట్రీక్ 2,943 పరుగులు చేసి 239 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు టెస్టుల్లో 73 పరుగులకు ఆరు, వ‌న్డేలలో 32 పరుగులకు ఐదు వికెట్లు. హీత్ తన కెరీర్‌లో సచిన్ టెండూల్కర్‌(Sachin Tendulkar)ను మూడుసార్లు, సౌరవ్ గంగూలీ(Saurav Ganguly)ని నాలుగుసార్లు అవుట్ చేశాడు.

31 ఏళ్ల వ‌య‌సులో హీత్ స్ట్రీక్ క్రికెట్ నుండి రిటైర్మెంట్(Retirement) తీసుకున్న‌ తర్వాత కోచ్‌(Coach)గా ఆటకు సేవలందించాడు. హీత్ స్ట్రీక్ బంగ్లాదేశ్(Bangladesh), జింబాబ్వే జట్టుకు కోచ్‌గా ప‌నిచేశాడు. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచింగ్ స్టాఫ్‌లో కూడా సభ్యుడు. అతను కౌంటీ క్రికెట్‌లో సోమర్‌సెట్ క్లబ్‌కు కోచ్‌గా కూడా పనిచేశాడు. దీంతో పాటు కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు కోచ్‌గా కూడా వ్యవహరించాడు.

2021లో ఐసీసీ(ICC) అతడిపై ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అవినీతి నిరోధక మార్గదర్శకాలను ఉల్లంఘించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. తన తప్పును అంగీకరించి, దానికి పూర్తి బాధ్యత వహిస్తూ క్షమాపణలు కూడా చెప్పాడు. ఐదు వేర్వేరు ఘటనల్లో అతడు దోషిగా తేలింది. ఫిక్సింగ్‌తో సంబంధం ఉన్న అనుమానితుడు స్ట్రీక్‌కు బిట్‌కాయిన్‌(Bit Coin)లను ఇచ్చాడు. తరువాత స్ట్రీక్ తన వివరణలో తాను ఎప్పుడూ మ్యాచ్ ఫిక్సింగ్ చేయలేదని చెప్పాడు. అయితే టీమ్‌కు సంబంధించిన అంతర్గత సమాచారం అందించినందుకు బదులుగా తనకు డబ్బు వచ్చినట్లు అతను అంగీకరించాడు.

Updated On 23 Aug 2023 12:01 AM GMT
Yagnik

Yagnik

Next Story