World Cup 2023 : బీసీసీఐకి షాకిచ్చిన హెచ్‌సీఏ.. వరల్డ్‌కప్ షెడ్యూల్ మళ్లీ మారనుందా..?
ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023 ఈసారి ప్రపంచకప్ భారత్ వేదికగా జరుగుతోంది. ప్రపంచకప్ షెడ్యూల్‌ను బీసీసీఐ, ఐసీసీ విడుదల చేశాయి. అయితే ఇప్పటికే భద్రత, ఇతర కారణాల వల్ల షెడ్యూల్‌లో మార్పులు కూడా చేశారు.
ఐసీసీ వన్డే ప్రపంచ కప్-2023 ఈసారి ప్రపంచకప్(World Cup 2023) భారత్ వేదికగా జరుగుతోంది. ప్రపంచకప్ షెడ్యూల్‌ను బీసీసీఐ(BCCI), ఐసీసీ(ICC) విడుదల చేశాయి. అయితే ఇప్పటికే భద్రత, ఇతర కారణాల వల్ల షెడ్యూల్‌లో మార్పులు కూడా చేశారు. భారత్-పాకిస్థాన్‌తో సహా 9 మ్యాచ్‌లు కూడా రీషెడ్యూల్ చేశారు. ఇప్పుడు మరోసారి ప్రపంచకప్ షెడ్యూల్ విషయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(Hyderabad Cricket Association) ఆందోళన వ్యక్తం చేయడంతో బీసీసీఐ టెన్షన్ మళ్లీ పెరిగింది. షెడ్యూల్ మార్చాలని హెచ్‌సీఏ మరోసారి డిమాండ్ చేసింది. ఈసారి కూడా పాక్ మ్యాచ్‌లో మార్పు రావచ్చు. తాజాగా హెచ్‌సీఏ.. ప్రపంచ కప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వడం కష్టంగా ఉందని బీసీసీఐకి తెలియజేసింది.
అక్టోబర్ 9న హైదరాబాద్(Hyderabad)లోని రాజీవ్ గాంధీ స్టేడియం(Rajiv Gandhi Stadium)లో న్యూజిలాండ్(Newzealand), నెదర్లాండ్స్(Netherland) మధ్య మ్యాచ్ జరగనుండగా.. మరుసటి రోజు అదే మైదానంలో శ్రీలంక(Srilanka) జట్టు పాకిస్థాన్(Pakistan)తో తలపడనుంది. రెండు మ్యాచ్‌ల మధ్య గ్యాప్ లేకపోవడంతో హైదరాబాద్ పోలీసులు భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్థాన్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న మ్యాచ్ అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. ముందుగా అక్టోబర్ 12న మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అక్టోబర్ 14కి రీషెడ్యూల్ చేయడంతో.. మ్యాచ్ డేట్ ముందుకు మార్చారు. దీంతో మరోమారు వరల్డ్ కప్ షెడ్యూల్‌లో మార్పులు జరుగుతాయని భావిస్తున్నారు.