శనివారం నాడు అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్

శనివారం నాడు అరుణ్ జైట్లీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ అద్భుతమైన బ్యాటింగ్ తో.. ఒక్క సారిగా 2017లో ఆమె ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ను గుర్తు చేసింది. ఇప్పటివరకు ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్ గా చెప్పవచ్చు. అద్భుతమైన ఇన్నింగ్స్ తో ముంబై ఇండియన్స్‌కు ప్లే ఆఫ్స్ కు వెళ్లేందుకు మార్గం సుగమం చేసింది. ప్లే ఆఫ్స్ లో ముంబై ఇండియన్స్ జట్టు చోటు దక్కించుకుంది. 2017 ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో ఆమె అద్భుతమైన 171*తో అభిమానులు ఈ ఇన్నింగ్స్ ను పోలుస్తున్నారు. ముంబై ఇండియన్స్ మరో బంతి మిగిలి ఉండగానే 191 పరుగులను ఛేదించింది.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 190 పరుగులు చేసింది. ఆ జట్టులో హేమలత 40 బంతుల్లోనే 74 పరుగులు చేసింది. భారీ స్కోర్ ఛేజింగ్ కోసం బరిలోకి దిగిన ముంబై జట్టు 15 ఓవర్లకు కేవలం 119 పరుగులు మాత్రమే చేసింది. మిగిలిన ఐదు ఓవర్లలో 14పైన రన్ రేట్ తో పరుగులు సాధించాల్సి ఉండగా.. హర్మన్ ప్రీత్ కౌర్ విధ్వంసకర బ్యాటింగ్ తో గుజరాత్ జెయింట్స్ బౌలర్లపై విరుచుకు పడింది. మొదట ఆమె 21 బంతుల్లో 20 పరుగులు మాత్రమే చేసింది. ఆ తరువాత 27 బంతుల్లో 75 పరుగులు చేసింది. మొత్తం 10 ఫోర్లు, ఐదు సిక్సుల సహాయంతో హర్మన్ ప్రీత్ కేవలం 48 బంతుల్లో 95 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.

Updated On 9 March 2024 10:52 PM GMT
Yagnik

Yagnik

Next Story