Hardik-Natasa Divorce : భార్య నటాషాతో పాండ్యా తెగతెంపులు.. 70 శాతం సంపద ఇవ్వాల్సిందేనా?
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) వైవాహిక జీవితం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. టైమ్ బ్యాడ్ ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది. ఐపీఎల్ టోర్నమెంట్‌లో ముంబాయి ఇండియన్స్(Mumbai Indians)కు సారథ్యం వహించిన పాండ్యా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. పలు విమర్శలను ఎదుర్కొన్నాడు.
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) వైవాహిక జీవితం మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. టైమ్ బ్యాడ్ ఉన్నప్పుడు ఇలాగే జరుగుతుంది. ఐపీఎల్ టోర్నమెంట్‌లో ముంబాయి ఇండియన్స్(Mumbai Indians)కు సారథ్యం వహించిన పాండ్యా ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించలేకపోయాడు. పలు విమర్శలను ఎదుర్కొన్నాడు. పోనీ వ్యక్తిగత జీవితమైనా బాగుందా అంటే అదీ లేదు. భార్య నటాషా స్టాంకోవిక్(Natasa Stankovic)తో తెగతెంపులు చేసుకోబోతున్నాడు. విడాకులు(Divorce) ఇస్తే మాత్రం డైవర్స్ సెటిల్‌మెంట్ కింద తన సంపాదనలో సగానికి పైగా నటాషాకు ఇవ్వాల్సి వస్తుంది. ఆల్‌మోస్టాల్ 70 శాతం సంపదను కోల్పోవాల్సి వస్తుంది. హార్దిక్ పాండ్యా, నటాషాలు విడిపోతున్నారనడానికి ఈ మధ్య ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పాండ్యా పేరును తొలగించడమే! అంతేనా.. త్వరలో ఒకరు రోడ్డు మీదకు రాబోతున్నారు అని ఓ పోస్టు పెట్టింది. ఇది ప్యాండ్యాను ఉద్దేశించి అని ఉంటుందని అంటున్నారు. గత కొంతకాలంగా పాండ్యా, నటాషాలు వ్యక్తిగత ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడం లేదు. నటాషా బర్త్ డే రోజున కూడా పాండ్యా విషెస్ చెప్పలేదు. ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదు. ఇవన్నీ వారి మధ్యన ఎడం పెరిగిందనే చెబుతున్నాయి. అయితే విడాకుల విషయంపై పాండ్యా కానీ, నటాషా కానీ ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. స్పెయిన్ మోడల్ నటాషాకు, హార్దిక్ పాండ్యాకు కరోనా సమయంలో అంటే 2020, మార్చి 31న పెళ్లి జరిగింది. వీరికి అగస్త్య అనే కొడుకు ఉన్నాడు. కరోనా కాలం కాబట్టి పెళ్లికి ఎక్కువ మందిని పిలవలేకపోయారు. అందుకే పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత నిరుడు ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజున మళ్లీ గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఉదయ్‌పూర్‌లో జరిగిన ఈపెళ్లికి బంధు మిత్రులందరూ వచ్చారు. కుమారుడు అగస్త్యను ఎత్తుకుని ఫోటోలు కూడా దిగారు పాండ్యా, నటాషా దంపతులు.