Harbhajan Singh : నిన్న విష్ చేశారు.. ఈ రోజు ట్రోల్ చేస్తున్నారు..!
హర్భజన్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా జులై 3న అభిమానులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జూలై 4న అభిమానులు అతనిని గట్టిగా ట్రోల్ చేస్తన్నారు. సోషల్ మీడియాలో హర్భజన్ చేసిన ట్వీట్‌పై స్పందించడం.. భజ్జీకి కష్టాన్ని తీసుకొచ్చింది. హర్భజన్ టాప్-5 టెస్ట్ ఆటగాళ్ల పేర్లను తప్పుగా వ్రాసాడు. దీంతో అభిమానులు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.

Harbhajan Singh Trolled By Fans After Tweeting Wrong Spelling Of Rishabh Pant
హర్భజన్ సింగ్ పుట్టినరోజు సందర్భంగా జులై 3న అభిమానులందరూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జూలై 4న అభిమానులు అతనిని గట్టిగా ట్రోల్ చేస్తన్నారు. సోషల్ మీడియాలో హర్భజన్ చేసిన ట్వీట్‌పై స్పందించడం.. భజ్జీకి కష్టాన్ని తీసుకొచ్చింది. హర్భజన్ టాప్-5 టెస్ట్ ఆటగాళ్ల పేర్లను తప్పుగా వ్రాసాడు. దీంతో అభిమానులు ఆయనను ట్రోల్ చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రపంచంలోని అత్యుత్తమ ఆటగాళ్ల గురించి అభిమానులు తరచుగా ట్వీట్ చేయడం కనిపిస్తుంది. క్రికెట్ వల్లా అనే ట్విట్టర్ వినియోగదారు కూడా ఒక ట్వీట్ చేసాడు. అందులో ప్రపంచంలోని టాప్ 5 టెస్ట్ క్రికెటర్లు ఎవరు అని ప్రశ్నించాడు. కేవలం ప్రతిభ ఆధారంగానే కాదు, పెద్ద టోర్నీల్లో గేమ్ ఛేంజర్‌గా, మ్యాచ్ విన్నర్‌గా చెప్పాలి. నేను బెన్ స్టోక్స్, పాట్ కమిన్స్ అనే ఇద్దరి పేర్లను ఎంచుకుంటాను. మీరు మిగిలిన ముగ్గురు ఆటగాళ్లను ఎంచుకుంటారా? అని ట్వీట్ చేశారు.
Nathan lyon ✅
Steav ❎ - Steve✅
Panth ❎ - Pant✅
Ravinder❎ - Ravindra ✅
strokes❎ - Stokes ✅ pic.twitter.com/V1PJpCO6dj— Akash Patel (@acash1008) July 4, 2023
ఈ ట్వీట్‌పై స్పందించిన హర్భజన్ సింగ్ ఐదుగురు ఆటగాళ్ల పేర్లను పేర్కొన్నాడు. హర్భజన్ సింగ్ ప్రకారం.. ప్రపంచంలోని అత్యుత్తమ టాప్ 5 టెస్ట్ ఆటగాళ్లు నాథన్ లియాన్, స్టీవ్ స్మిత్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, బెన్ స్టోక్స్. అయితే ఈ ట్వీట్ చేయడమే హర్భజన్‌కు సమస్యలు తెచ్చిపెట్టింది. హర్భజన్ ఇంగ్లీషులో ఆటగాళ్ల పేర్ల స్పెల్లింగ్‌ను తప్పుగా వ్రాసాడు. నాథన్ లియాన్ స్పెల్లింగ్‌ను మాత్రమే భజ్జీ సరిగ్గా రాశాడు, రిషబ్ పంత్ నుండి బెన్ స్టోక్స్ వరకు అందరి పేరు తప్పుగా పేర్కొన్నాడు. దీంతో అతడిని ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.