GT vs RCB : విల్ జాక్వెస్ విధ్వంసం.. టైటాన్స్‌పై ఆర్సీబీ ఘన విజయం
IPL 2024 45వ మ్యాచ్ ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, విల్ జాక్వెస్‌ల విధ్వంసక భాగస్వామ్యం సాయంతో ఆర్‌సిబి తొమ్మిది వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది.
IPL 2024 45వ మ్యాచ్ ఆదివారం గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, విల్ జాక్వెస్‌ల విధ్వంసక భాగస్వామ్యం సాయంతో ఆర్‌సిబి తొమ్మిది వికెట్ల తేడాతో గుజరాత్‌ను ఓడించింది. ఈ విజయంతో ఆర్సీబీ ఖాతాలో ఆరు పాయింట్లు చేరాయి. అయితే పాయింట్ల పట్టికలో ఆ జట్టు ఇంకా 10వ స్థానంలోనే కొనసాగుతోంది. అదే సమయంలో గుజరాత్ ఎనిమిది పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.
201 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆర్సీబీ టాప్ ఆర్డర్ తుఫాన్ ప్రదర్శన చేసింది. బ్యాటింగ్‌కు దిగిన ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, విరాట్ కోహ్లీలు 40 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన విల్ జాక్వెస్ గుజరాత్‌పై దూకుడుగా బ్యాటింగ్ చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు.
విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్‌లో కనిపించాడు. ఈ సీజన్‌లో 32 బంతుల్లో నాలుగో అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మ్యాచ్ ముగిసే సమయానికి కోహ్లీ 44 బంతుల్లో 70 పరుగులతో అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్‌పై కింగ్ కోహ్లీ 159.09 స్ట్రైక్ రేట్‌తో ఆరు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. దీంతో విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో 500 పరుగులు పూర్తి చేశాడు.
విల్ జాక్వెస్ కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అతని ఐపీఎల్ కెరీర్‌లో ఇదే తొలి సెంచరీ. అతను 243.90 స్ట్రైక్ రేట్‌తో ఐదు పోర్లు, 10 సిక్సర్లు కొట్టాడు. దీంతో RCB 16 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 206 పరుగులు చేసి తొమ్మిది వికెట్ల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఈ ఐపీఎల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టైటాన్స్‌కు ఇదే అతిపెద్ద స్కోరు. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్, షారుక్‌ఖాన్‌లు మంచి ప్రదర్శన చేసి అర్ధసెంచరీలు చేశారు. బ్యాటింగ్‌కు దిగిన వృద్ధిమాన్ సాహా ఐదు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. తొలి ఓవర్ చివరి బంతికి స్వప్నిల్ సింగ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. కాగా, కెప్టెన్ గిల్ 16 పరుగులు చేశాడు.
మూడో వికెట్‌కు సాయి సుదర్శన్, షారుక్ ఖాన్ మధ్య 86 పరుగుల భాగస్వామ్యాన్ని సిరాజ్ బద్దలు కొట్టాడు. 15వ ఓవర్ తొలి బంతికి షారుక్ బౌల్డ్ అయ్యాడు. అతను 193 స్ట్రైక్ రేట్ లో 30 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఆ తర్వాత సుదర్శన్ తన ఐపీఎల్ కెరీర్‌లో ఆరో ఫిఫ్టీని సాధించాడు. ఇందుకోసం 34 బంతుల సాయం తీసుకున్నాడు. సుదర్శన్ నాలుగో వికెట్‌కు మిల్లర్‌తో కలిసి 69 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పాడు. సుదర్శన్ 49 బంతుల్లో 84 పరుగులతో బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో ఐపీఎల్ 2024లో 400 పరుగులు పూర్తి చేసిన రెండో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఐదో నంబర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన డేవిడ్ మిల్లర్ 19 బంతులు ఎదుర్కొని 26 పరుగులు చేయగలిగాడు. ఆర్సీబీ తరఫున స్వప్నిల్ సింగ్, మహ్మద్ సిరాజ్, గ్లెన్ మాక్స్‌వెల్ ఒక్కో వికెట్ తీశారు.