ఐపీఎల్ 2023లో శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)ను ఓడించి గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు జట్లకు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 153 పరుగులు చేయగా.. గుజరాత్ మరో బంతి మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం […]

ఐపీఎల్ 2023లో శుక్ర‌వారం జ‌రిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌(Punjab Kings)ను ఓడించి గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మూడో విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో తొలి నాలుగు జట్లకు చేరుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 153 పరుగులు చేయగా.. గుజరాత్ మరో బంతి మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో పంజాబ్ కింగ్స్‌పై గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.

ఈ టోర్నీలో గుజరాత్‌కు ఇది మూడో విజయం కాగా.. ఈ విజయంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు జట్లలో చేరింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ ఎనిమిది వికెట్లకు 153 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా గుజరాత్ జట్టు మరో బంతి మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

పంజాబ్‌లో మాథ్యూ షార్ట్(Matthew Short) అత్యధికంగా 36 పరుగులు చేశాడు. గుజరాత్ తరఫున మోహిత్ శర్మ(Mohit Sharma) రెండు వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లందరికీ ఒక్కో వికెట్ దక్కింది. గుజరాత్ తరఫున శుభ్‌మన్ గిల్(Shubman Gill) 67 పరుగులతో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. మ‌రో ఓపెన‌ర్ వృద్ధిమాన్ సాహా(Wriddhiman Saha) 30 పరుగులు చేశాడు. పంజాబ్‌ తరఫున అర్ష్‌దీప్‌, రబడ, సామ్‌ కరణ్‌, హర్‌ప్రీత్‌ బ్రార్ లు ఒక్కో వికెట్‌ తీశారు.

Updated On 13 April 2023 11:31 PM GMT
Yagnik

Yagnik

Next Story