IPL-2023 Final Match : నేడు ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్.. చెన్నైతో తలపడనున్న గుజరాత్..!
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్ ఆదివారం గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్-1లో ధోనీ సారథ్యంలోని చెన్నై.. గుజరాత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. గుజరాత్ రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది.

Gujarat Titans hope to gatecrash MSD party
ఐపీఎల్ 2023 ఫైనల్ మ్యాచ్(IPL Final) ఆదివారం గుజరాత్ టైటాన్స్(Gujarat Titans), చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) జట్ల మధ్య జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. క్వాలిఫయర్-1(Qualifier 1)లో ధోనీ సారథ్యంలోని చెన్నై.. గుజరాత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. గుజరాత్ రెండో క్వాలిఫయర్(Qualifier 2) మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఓడించి ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఈ సీజన్‌లో రెండు జట్లూ అద్భుతంగా రాణించాయి. వరుసగా రెండోసారి గుజరాత్ ఫైనల్స్‌కు చేరుకుంది. చెన్నై(Chennai) ఐపీఎల్‌లో 10వ సారి ఫైనల్‌కు చేరింది. ఈ సీజన్ మొత్తంలో ఇరు జట్లు ఆల్ రౌండ్ ప్రదర్శన చేశాయి. బౌలింగ్ విభాగం, బ్యాటింగ్ విభాగం, ఫీల్డింగ్ విభాగం.. మూడు విభాగాల్లోనూ ఇరు జట్ల ప్రదర్శన అద్భుతంగా ఉంది.
ఈ సీజన్‌లో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలవగా.. చెన్నై జట్టు రెండో స్థానంలో ఉంది. మహేంద్ర సింగ్ ధోనీ(MS Dhoni) వంటి అనుభవజ్ఞుడైన కెప్టెన్‌ని కలిగి ఉండడమే చెన్నైకి అతిపెద్ద బలం. గుజరాత్ టీమ్‌కు శుభ్‌మాన్ గిల్(Shubhman Gill) ప్రస్తుత ఫామ్ కలిసొచ్చే అంశం. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ లో రుతురాజ్ గైక్వాడ్(Ruthuraj Gaikwad), డెవాన్ కాన్వే(Devon Conway), రవీంద్ర జడేజా(Ravindra Jadeja), దీపక్ చాహర్(Deepak Chahar), మతిషా పతిరనా అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఫైనల్‌లో చెన్నై ఈ ఐదుగురు ఆటగాళ్లపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఈ రెండు జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం నాలుగు మ్యాచ్‌లు జరగగా.. మూడు మ్యాచ్‌ల్లో గుజరాత్ గెలుపొందగా.. చెన్నై జట్టు ఒకసారి గెలిచింది.
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్-11)
రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే, అజింక్యా రహానే, అంబటి రాయుడు, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్ & కెప్టెన్), దీపక్ చాహర్, తుషార్ దేశ్‌పాండే, మహేశ్ తీక్షణ.
గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్-11)
వృద్ధిమాన్ సాహా (వికె), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా (సి), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహ్మద్ షమీ
