Yash Dayal : చరిత్రలో మర్చిపోలేని చివరి ఓవర్ వేసిన యష్ దయాల్.. భారీ ధరకే కొన్నారు..!
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ అద్భుత బ్యాటింగ్ చేసి చివరి ఓవర్‌లో విజయాన్ని అందించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ చివరి ఓవర్‌లో 31 పరుగులు ఇచ్చి జట్టుకు పెద్ద విలన్‌గా మారాడు. ఈ ప్లేయర్ గురించి తెలుసుకుందాం. చివరి ఓవర్‌లో కేకేఆర్ జట్టు విజయానికి 29 పరుగులు కావాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ […]
గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రింకూ సింగ్ అద్భుత బ్యాటింగ్ చేసి చివరి ఓవర్‌లో విజయాన్ని అందించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలర్ చివరి ఓవర్‌లో 31 పరుగులు ఇచ్చి జట్టుకు పెద్ద విలన్‌గా మారాడు. ఈ ప్లేయర్ గురించి తెలుసుకుందాం.
చివరి ఓవర్‌లో కేకేఆర్ జట్టు విజయానికి 29 పరుగులు కావాల్సి ఉంది. గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ రషీద్ ఖాన్(Rasheedh Khan) బంతిని 24 ఏళ్ల యశ్ దయాల్ చేతికి అందించాడు. ఆ సమయంలో యశ్ దయాల్(Yash Dayal) 29 పరుగులు ఇస్తాడని ఎవరూ ఊహించలేదు. ఉమేష్ యాదవ్ మొదటి బంతిని ఎదుర్కొన్నాడు. సింగిల్ తీసి రింకూ సింగ్‌కి స్ట్రైక్ ఇచ్చాడు. ఆ తర్వాతే జరిగింది రింకూ చిచ్చరపిడుగులా చేలరేగడం. వరుసగా 5 బంతుల్లో 5 సిక్సులు బాది చరిత్రలో నిలచిపోయే విజయాన్ని అందించాడు.
ఐపీఎల్-2022 మెగా వేలంలో యష్ దయాల్‌ను గుజరాత్ టైటాన్స్ జట్టు రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది. యష్ దయాల్ 2021-22 సీజన్‌లో విజయ్ హజారే ట్రోఫీలో టాప్-10 వికెట్లు తీసిన బౌలర్లలో ఒకడు. గత సీజన్‌లో గుజరాత్ తరఫున 9 మ్యాచ్‌లు ఆడి 11 వికెట్లు పడగొట్టి టైటిల్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఐతే ఐపీఎల్-2023లో యష్ పేలవమైన ఫామ్‌తో పోరాడుతున్నాడు. వికెట్ల కోసం నానా ఇబ్బంది పడుతున్నాడు. ఐపీఎల్-2023లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయాడు. ఈ మ్యాచ్‌లో ఏకంగా చివరి ఓవర్‌లో 29 పరుగులు ఇచ్చాడు. అంతేకాదు 4 ఓవర్లలో ఏకంగా 69 పరుగులిచ్చాడు. ఐపీఎల్ చరిత్రలో 4 ఓవర్లలో ఎక్కువ పరుగులిచ్చిన బౌలర్ల జాబితాలో బసిల్ తాంపి(70) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. దీంతో గుజరాత్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.
తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ 204 పరుగుల భారీ స్కోరు సాధించింది. గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి సుదర్శన్(Sai Sudarshan), విజయ్ శంకర్(Vijay Shankar) భారీ ఇన్నింగ్స్ ఆడారు. సుదర్శన్ 53 పరుగులు చేశాడు. విజయ్ శంకర్ 63 పరుగులు చేశాడు. అనంతరం కేకేఆర్ జట్టులో వెంకటేష్ అయ్యర్ 83 పరుగులు చేశాడు. రింకూ సింగ్(Rinku Singh) హీరో ఆఫ్ ద మ్యాచ్(Hero Of The Match)గా నిలిచాడు. 21 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో ఐదు సిక్సర్లు బాది కేకేఆర్ జట్టుకు విజయాన్ని అందించాడు.