ఐపీఎల్‌-2023లో మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ 35వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు గుజరాత్‌పై 55 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. తొలుత ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన‌ గుజరాత్ జట్టు 20 ఓవ‌ర్ల‌లో 207 పరుగులు చేసింది. చేధ‌న‌లో ముంబై జట్టు కేవలం 9 వికెట్ల కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేసింది.

ఐపీఎల్‌-2023లో మంగ‌ళ‌వారం జ‌రిగిన‌ 35వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు గుజరాత్‌పై 55 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది. తొలుత ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన‌ గుజరాత్(Gujarat) జట్టు 20 ఓవ‌ర్ల‌లో 207 పరుగులు చేసింది. చేధ‌న‌లో ముంబై(Mumbai) జట్టు కేవలం 9 వికెట్ల కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేసింది.

208 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి పేలవమైన ఆరంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ 2 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఇషాన్ కిషన్(Ishan Kishan) కూడా 13 పరుగులే చేశాడు. తిలక్ వర్మ(Tilak Varma)(2) విఫ‌ల‌మ‌య్యాడు. త‌ర్వాత‌ కామెరాన్ గ్రీన్(Cameron Green) (33), సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) (23), నేహాల్ వధేరా (40) ప‌ర్వాలేద‌నిపించినా.. ముంబయిని మ్యాచ్ గెలిచే ఇన్నింగ్సు మాత్రం ఎవ‌రూ ఆడ‌లేక‌పోయారు. గుజ‌రాత్ బైల‌ర్ల‌లో నూర్ అహ్మ‌ద్(Noor Ahmad) మూడు, ర‌షీద్ ఖాన్(Rasheed Khan) రెండు, మోహిత్ శ‌ర్మ(Mohit Sharma) రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ బ్యాట్స్‌మెన్ ముంబైకి 208 పరుగుల లక్ష్యాన్ని అందించింది. ఆరంభంలోనే ఓపెన‌ర్ వృద్ధిమాన్ సాహా(Vriddhiman Saha) 4 పరుగులకే ఔటయ్యాడు. అయితే.. తర్వాత గుజరాత్ బ్యాట్స్‌మెన్ ముంబై బౌలర్లను భీకరంగా చిత్తు చేశారు. శుభ్‌మన్ గిల్ 56, అభినవ్ మనోహర్(Abhinav Manohar) 42, డేవిడ్ మిల్లర్(David Miller) 46, రాహుల్ తెవాటియా(Rahul Tewatia) 20 పరుగులు చేశారు. ముంబై బౌల‌ర్ల‌లో పీయూష్ చావ్లా(Piyush Chawla) రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌తో ఆక‌ట్టుకున్న అభిన‌వ్ మ‌నోహ‌ర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ ద‌క్కింది.

ఈ రెండు జట్ల హెడ్ టు హెడ్ రికార్డును ప‌రిశీలిస్తే.. ముంబైదే పైచేయి. గత సీజన్‌లో ఈ రెండు జట్లు ఒక్కసారి మాత్రమే తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో ముంబై జట్టు విజయం సాధించింది. ఈ సీజన్‌లో గుజరాత్ 7 మ్యాచ్‌లు ఆడగా.. 5 మ్యాచ్‌లు గెలిచి 10 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మరోవైపు ముంబై జట్టు 7 మ్యాచ్‌ల్లో 3 గెలిచి 6 పాయింట్లు సాధించి 7వ స్థానంలో ఉంది.

Updated On 25 April 2023 9:03 PM GMT
Yagnik

Yagnik

Next Story