అహ్మదాబాద్‌లో జరిగిన క్వాలిఫయర్‌-2లో గుజరాత్ టైటాన్స్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్స్ ఏకపక్షంగా 62 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌ను చిత్తు చేసింది. తొలుత శుభ్‌మన్ గిల్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగా.. త‌ర్వాత‌ మోహిత్ శర్మ బంతితో గుజరాత్‌కు మరో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌తో ఫైన‌ల్లో గుజరాత్ త‌ల‌ప‌డ‌నుంది.

అహ్మదాబాద్‌లో జరిగిన క్వాలిఫయర్‌-2(Qualifier 2)లో గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. హార్దిక్ పాండ్యా(Hardik Pandya) నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్స్ ఏకపక్షంగా 62 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్‌(Mumbai Indians)ను చిత్తు చేసింది. తొలుత శుభ్‌మన్ గిల్(Shubhman Gill) బ్యాట్‌తో విధ్వంసం సృష్టించగా.. త‌ర్వాత‌ మోహిత్ శర్మ(Mohit Sharma) బంతితో గుజరాత్‌(Gujarat)కు మరో చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్‌(Chennai Super Kings)తో ఫైన‌ల్లో గుజరాత్ త‌ల‌ప‌డ‌నుంది.

టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్‌కు శుభ్‌మన్ గిల్, సాహా శుభారంభం అందించారు. గిల్ కేవలం 60 బంతుల్లో 129 పరుగులతో తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. అత‌నికి సాయి సుదర్శన్(Sai Sudarshan) 31 బంతుల్లో 43 పరుగులతో స‌హ‌కారం అందించాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య చివర్లో 13 బంతుల్లో 28 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది.

234 పరుగుల ల‌క్ష్య చేధ‌న‌కు దిగిన‌ ముంబైకి పేలవమైన ఆరంభం లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), నెహాల్ వధెరా(Nehal Wadhera) వెంట‌వెంట‌నే పెవిలియన్ బాట పట్టారు. కెమరూన్ గ్రీన్(Cameron Green) కూడా 30 పరుగులు, సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) 61 పరుగులు, తిల‌క్ వ‌ర్మ(Tilak Varma) 43 ప‌రుగులు చేశారు. మిగ‌తా బ్యాట్స్‌మెన్ ఎవ‌రూ రాణించ‌క‌పోవ‌డంతో ముంబై 171 పరుగులకు ఆలౌట్ అయింది. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో టిమ్ డేవిడ్ చేసిన తప్పిదం ముంబై ఇండియన్స్‌ను దెబ్బతీసింది. 31 పరుగుల వద్ద శుభ్‌మన్ గిల్ ఇచ్చిన‌ క్యాచ్‌ను డేవిడ్(Tim David) వదిలేశాడు. దీంతో చెల‌రేగిన గిల్ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నంత‌వ‌ర‌కూ ముంబై గెలుపు ఆశలు అలాగే ఉన్నాయి. అయితే 15వ ఓవర్లో మోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ వికెట్ తీసి గుజరాత్ విజయాన్ని ఖాయం చేసేశాడు. మోహిత్‌ సూర్యను క్లీన్‌ బౌల్డ్‌ చేసి పెవిలియన్ చేర్చాడు. మోహిత్ 2.2 ఓవర్లలో కేవలం 10 పరుగులిచ్చి ఐదు వికెట్లు పడగొట్టి గుజరాత్‌ను ఫైనల్‌కు చేర్చ‌డంలో కీలక పాత్ర పోషించాడు.

Updated On 26 May 2023 8:32 PM GMT
Yagnik

Yagnik

Next Story