ఐపీఎల్‌-2023లో 30వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య మ్యాచ్‌ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయింది. లక్నో నుంచి విజయాన్ని గుంజుకున్న‌ట్టే గుజరాత్ జట్టు అద్భుత రీతిలో విజయం సాధించింది. గుజరాత్ విజయంలో ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ షమీ, మోహిత్ శర్మ అద్భుత పాత్ర పోషించారు. మోహిత్ శర్మ చివరి ఓవర్‌లో నాలుగు వికెట్లు పడటంతో లక్నో ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది.

ఐపీఎల్‌-2023లో 30వ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants), గుజరాత్ టైటాన్స్(Gujarat Titans) మధ్య మ్యాచ్‌ లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు గెలిచే మ్యాచ్‌లో ఓడిపోయింది. లక్నో నుంచి విజయాన్ని గుంజుకున్న‌ట్టే గుజరాత్ జట్టు అద్భుత రీతిలో విజయం సాధించింది. గుజరాత్ విజయంలో ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ షమీ(Mohammad Shami), మోహిత్ శర్మ(Mohith Sharma) అద్భుత పాత్ర పోషించారు. మోహిత్ శర్మ చివరి ఓవర్‌లో నాలుగు వికెట్లు పడటంతో లక్నో ఈ మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya) టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. లక్నో జట్టు తమ సొంత మైదానంలో ఛేజింగ్‌కు దిగి 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇది లో స్కోరింగ్ మ్యాచ్. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్(KL Rahul) 61 బంతుల్లో 68 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్సు జ‌ట్టు విజ‌యానికి ఉప‌యోగ‌ప‌డ‌లేదు.

తొలి ఇన్నింగ్స్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు పేలవమైన ఆరంభం లభించింది. ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. వృద్ధిమాన్ సాహా 47 పరుగులు చేసి కెప్టెన్ హార్దిక్ పాండ్యాతో కలిసి రెండో వికెట్‌కు 68 పరుగులు జోడించాడు. హార్దిక్ 50 బంతుల్లో 66 పరుగులు చేశాడు. విజయ్ శంకర్ 10, అభినవ్ మనోహర్ 3, డేవిడ్ మిల్లర్ 6 విఫలమయ్యారు. దీంతో 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ల‌క్నో బౌల‌ర్ల‌లో కృనాల్ పాండ్యా 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. మార్కస్ స్టోయినిస్(Marcus Stoinis) 3 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అమిత్ మిశ్రా(Amit Mishra), నవీన్-ఉల్-హక్ లు(Navven-ul-Hak) చెరో వికెట్ తీసుకున్నారు.

దీనికి సమాధానంగా లక్నో సూపర్ జెయింట్స్ ఓపెన‌ర్స్‌లో కైల్ మైయర్స్(Kyle Mayors) 24 పరుగులు చేశాడు. కేఎల్‌ రాహుల్ ఒక ఎండ్‌లో నిలిచి అర్ధసెంచరీ చేశాడు. కానీ అతని ఇన్నింగ్స్ నెమ్మదిగా సాగింది. కృనాల్ పాండ్యా(Krunal Pandya) 23 పరుగులు చేసి కెప్టెన్‌కు మద్దతుగా నిలిచాడు. చివరి 8 ఓవర్లలో జట్టుకు 46 పరుగులు అవసరం కాగా.. 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. లక్నో విజయం ఖాయం అనిపించింది. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లు అద్భుతంగా పునరాగమనం చేసి జట్టును గెలిపించారు. చివరి ఓవర్‌లో మోహిత్ శర్మ బౌలింగ్‌కు దిగాడు. అక్నో విజ‌యానికి 12 పరుగులు అవ‌స‌రం కాగా.. 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్‌లో నాలుగు వికెట్లు పడ్డాయి. మోహిత్ రెండు వికెట్లు నేల‌కూల్చ‌గా.. రెండు ర‌నౌట్‌లు అయ్యాయి. దీంతో గుజ‌రాత్ ఉత్కంఠ‌భ‌రిత మ్యాచ్‌లో విజ‌యం ద‌క్కించుకుంది.

Updated On 22 April 2023 9:27 AM GMT
Yagnik

Yagnik

Next Story