Kolkata Knight Riders vs Gujarat Titans : విజయ్ శంకర్ విధ్వంసం.. కేకేఆర్‌పై ప్రతీకారం తీర్చుకున్న గుజరాత్
ఐపీఎల్-2023లో 39వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ గుజరాత్ టైటాన్స్‌తో తలపడింది. ఈ సీజన్ ప్రారంభంలో రెండు జట్లు తలపడగా.. కేకేఆర్.. గుజరాత్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్‌లో రింకూ సింగ్ చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టి ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే కేకేఆర్‌కు అంధించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈరోజు మ్యాచ్‌లో గుజరాత్ గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది.

Gujarat Titans beat Kolkata Knight Riders by 7 wickets to go top of the table
ఐపీఎల్-2023లో 39వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) గుజరాత్ టైటాన్స్(Gujarat Titans)తో తలపడింది. ఈ సీజన్ ప్రారంభంలో రెండు జట్లు తలపడగా.. కేకేఆర్(KKR).. గుజరాత్(Gujarat)ను 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఆ మ్యాచ్‌లో రింకూ సింగ్(Rinku Singh) చివరి ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టి ఐపీఎల్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే కేకేఆర్‌కు అంధించాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈరోజు మ్యాచ్‌లో గుజరాత్ గత ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. కోల్‌కతాపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. గుజరాత్ విజయంలో విజయ్ శంకర్(Vijay Shankar) 24 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి హీరో అయ్యాడు.
ఈ మ్యాచ్‌లో గుజరాత్ కెప్టెన్ పాండ్యా(Hardik Pandya) టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ జట్టు ఈరోజు రెండు మార్పులతో బరిలోకి దిగింది. జాసన్ రాయ్(Jason Roy) స్థానంలో రెహ్మానుల్లా గుర్బాజ్ జట్టులోకి వచ్చాడు. వస్తూనే అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత బ్యాటింగ్ చేసిన 179 పరుగులు చేసింది. కోల్‌కతా తరఫున ఓపెనర్ గుర్బాజ్ 39 బంతుల్లో 81 పరుగులు చేశాడు. ఆఖర్లో ఆండ్రీ రస్సెల్(Andrew Russel) 19 బంతుల్లో 34 పరుగులు చేసి జట్టు స్కోరును 180కి చేరువ చేశాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున మహమ్మద్ షమీ(Mohammad Shami) నాలుగు ఓవర్లలో 33 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. నూర్ అహ్మద్(Noor Ahmad) 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి రెండు వికెట్లు, జాషువా లిటిల్ 4 ఓవర్లలో 25 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశారు. అనంతరం 180 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ జట్టు జట్టు కేవలం 17.5 ఓవర్లలో చేధించింది. గుజరాత్ బ్యాట్స్‌మెన్‌లో శుభ్‌మాన్ గిల్(49), విజయ్ శంకర్(51), డేవిడ్ మిల్లర్(32), హార్దిక్ పాండ్యా(26) రాణించారు. ఈ విజయంతో గుజరాత్ జట్టు పాయింట్ల పట్టికలోనూ అగ్రస్థానానికి చేరుకుంది.
