ఐపీఎల్‌-2023లో 25వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ జ‌ట్ల‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది

ఐపీఎల్‌-2023లో 25వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad), ముంబై ఇండియన్స్(Mumbai Indians) జ‌ట్ల‌ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్(hyderabad) టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ జట్టు 19.5 ఓవర్లలో 178 పరుగులకు ఆలౌటైంది. దీంతో ముంబై ఇండియన్స్ 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.

తొలి ఇన్నింగ్స్‌లో ముంబై తరఫున కెమెరాన్ గ్రీన్(Cameron Green) అత్యధికంగా 64(6 ఫోర్లు, 2 సిక్సర్లు) పరుగులు చేశాడు. హైద్రాబాద్ కుర్రాడు తిలక్ వర్మ(Tilak Varma) కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. తిల‌క్‌ 17 బంతుల్లో 37(రెండు ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులు చేశాడు. రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన‌ హైదరాబాద్ జ‌ట్టులో మయాంక్ అగర్వాల్(Mayank Agarwal) (48), హెన్రిచ్ క్లాసెన్(Henrich Klassen) (36) రాణించినా విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ముంబై బౌలర్లలో జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, రైలీ మెరెడిత్, పీయూష్ చావ్లా(Piyush Chawla) త‌లా రెండు వికెట్లు తీయగా, కెమెరాన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్‌లు చెరో వికెట్ తీశారు.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(Rohit Shama) 28 పరుగులు చేశాడు. 14 ప‌రుగుల వ‌ద్ద రోహిత్‌ ఐపీఎల్‌లో 6000 పరుగుల మైలురాయిని పూర్తి చేశాడు. త‌ద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. ఇంతకుముందు విరాట్ కోహ్లీ(Virat Kohli), శిఖర్ ధావన్(shikar Dawan), డేవిడ్ వార్నర్(david Warner) లు ఐపీఎల్‌లో 6000 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 232 మ్యాచ్‌ల్లో 6000 పరుగులు పూర్తి చేశాడు. 15 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఐపీఎల్ తొలి సీజన్‌(IPL First Season) నుంచి రోహిత్‌ శర్మ ఆడుతూనే ఉన్నాడు.

Updated On 19 April 2023 12:25 AM GMT
Yagnik

Yagnik

Next Story