IND vs BAN Pitch Report : మూడేళ్ల తర్వాత గ్రీన్ పార్క్‌లో మ్యాచ్.. పిచ్ ఎవరికి అనుకూలిస్తుందంటే..
సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండవ చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది.
సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్‌లో భారత్, బంగ్లాదేశ్ మధ్య రెండవ చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్‌కు సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశం ఉండగా.. భారత్‌కు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. మూడేళ్ల తర్వాత గ్రీన్ పార్క్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది.
రెండవ మ్యాచ్‌పై అకాల రుతుపవనాల ప్రభావం కనిపిస్తుంది. వర్షం కారణంగా మ్యాచ్ ఉత్కంఠ దెబ్బతినే అవకాశం ఉంది. అయితే కాన్పూర్‌లో నల్లటి నేల పిచ్ ఉంటుంది. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో వచ్చిన బౌన్స్ కంటే ఆటగాళ్లు కొంచెం తక్కువ బౌన్స్‌ని చూడవచ్చు.
గ్రీన్ పార్క్‌లో 2016, 2021లో జరిగిన గత రెండు మ్యాచ్‌లలో 1,000 పరుగుల మార్కును దాటింది. 2016లో న్యూజిలాండ్‌పై భారత్ విజయం సాధించగా.. 2021లో కివీస్ ఇక్కడ డ్రాగా ముగించింది.
అయితే పిచ్ ఎలా ఉంటుంది అనేది వాతావరణ పరిస్థితులు నిర్దేశిస్తాయి. ముఖ్యంగా మొదటి రెండు రోజుల్లో పిచ్ బ్యాట్స్‌మెన్, బౌలర్‌లకు ఒకేలా సహాయపడుతుందని.. దీంతో మంచి పోటీ ఉంటుందని క్యూరేటర్ శివ కుమార్ తెలిపారు. గ్రీన్ పార్క్ కూడా చెన్నై మ్యాచ్ అనుభూతిని కలిగిస్తుంది. అందరికీ ఏదో ఒకలా ఉపయోగపడుతుంది. మొదటి రెండు సెషన్లలో బౌన్స్ ఉంటుంది. మొదటి రెండు రోజులు బ్యాటింగ్‌కు పిచ్ చాలా బాగుంటుంది. చివరి మూడు రోజుల్లో స్పిన్నర్ల పాత్ర కీలకం కానుందని పేర్కొన్నారు.