Glen Phillips Catch : ఆహా.. ఏం క్యాచ్ రా..బాబు..!
క్రికెట్(Cricket) చరిత్రలోనే మహా అద్భుతమైన క్యాచ్‌ను(Catch) న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్(Glen Phillips) పట్టారు.
క్రికెట్(Cricket) చరిత్రలోనే మహా అద్భుతమైన క్యాచ్‌ను(Catch) న్యూజిలాండ్ క్రికెటర్ గ్లెన్ ఫిలిప్స్(Glen Phillips) పట్టారు. న్యూజిలాండ్(New zealand), ఇంగ్లండ్(England) వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో నమ్మడానికి వీలులేని క్యాచ్‌ను అందుకున్నాడు. డైవింగ్ చేస్తూ ఒంటిచేత్తో అద్భుతమైన క్యాచ్ పట్టారు. ఆ క్యాచ్‌ను చూసి మ్యాచ్ చూస్తున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఫిలిప్స్ విన్యాసం చూసిన నెటిజన్లు అతణ్ని కొనియాడుతున్నారు. ఈ క్యాచ్‌కు సంబంధించి కామెంట్స్ చేస్తున్నారు.
ఇంగ్లండ్ బ్యాటింగ్ చేస్తుండగా 53వ ఓవర్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ టాంలాథం టీం సౌథీకి బౌలింగ్ అవకాశం కల్పించాడు. ఓలీపోప్, హ్యారీ బ్రూక్‌తో కలిసి ఐదో వికెట్‌కు 151 పరుగల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. సౌథీ వేసిన షార్ట్ పిచ్ బంతికి ఓలీపోప్ కట్ షాట్ ఆడాడు. గ్లెన్ ఫిలిప్స్ ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి ఒంటిచేత్తో అద్భుత క్యాచ్ అందుకున్నాడు. దీంతో పోప్ 77 పరుగల వద్ద తిరుగుముఖమం పట్టాడు. ఈ క్యాచ్ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.