Gautam Gambhir : హార్దిక్ పాండ్యాకు షాక్.. కెప్టెన్‌గా అతడినే కొనసాగించండి
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగాలని గౌతమ్ గంభీర్ అన్నాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. గత సంవత్సరం నుండి హార్దిక్ పాండ్యా భారత T20 జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ..
వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు రోహిత్ శర్మ(Rohit Sharma) కెప్టెన్‌గా కొనసాగాలని గౌతమ్ గంభీర్(Gautam Gambhir) అన్నాడు. స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. గత సంవత్సరం నుండి హార్దిక్ పాండ్యా(Hardik Pandya) భారత T20 జట్టుకు నాయకత్వం వహిస్తున్నప్పటికీ.. వెస్టిండీస్, అమెరికా సంయుక్తంగా నిర్వహించే T20 ప్రపంచ కప్‌కు రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఉండాలని గౌతమ్ గంభీర్ సూచించాడు. 2024 టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టులోకి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ(Virat Kohli)లు ఇద్దరినీ ఎంపిక చేయాలని గంభీర్ అన్నాడు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇద్దరినీ ఎంపిక చేయాలి. టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ కనిపించాలని కోరుకుంటున్నాను. హార్దిక్ పాండ్యా T20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా ఉన్నాడు. కానీ రోహిత్ శర్మ T20 ప్రపంచ కప్‌కి కెప్టెన్‌గా ఉండాలని నేను కోరుకుంటున్నాను. వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ బ్యాటింగ్‌తో తన సత్తా ఏమిటో చూపించాడు. రోహిత్ శర్మను ఎంపిక చేస్తే విరాట్ కోహ్లి కూడా ఆటోమేటిక్‌గా ఎంపికవుతాడు. రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ ఆడాలని నిర్ణయించుకుంటే.. అతడిని బ్యాట్స్‌మెన్‌గా కాకుండా కెప్టెన్‌గా ఎంపిక చేయాలని అభిప్రాయపడ్డాడు.
రోహిత్ శర్మ క్రికెట్ భవితవ్యంపై నిర్ణయం తీసుకుంటాడనే వార్తలు జోరందుకున్నాయి. రాబోయే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ పాల్గొంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం భారత జట్టు ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌లో బిజీగా ఉంది. సూర్యకుమార్ యాదవ్ భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయాన్ని నమోదు చేసింది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌లో రెండో మ్యాచ్ ఆదివారం తిరువనంతపురంలో జరగనుంది.